Ramarao
Raviteja : మాస్ మహారాజ రవితేజ కరోనా తర్వాత “క్రాక్” సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. ‘క్రాక్’ సినిమాతో సాలిడ్ సక్సెస్ సాధించి గట్టి కంబ్యాక్ ని ఇచ్చాడు రవితేజ. ‘క్రాక్’ ఇచ్చిన ఊపుతో ఒకేసారి వరుసగా అయిదు ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసి అందరికి షాకిచ్చాడు. ఇప్పటికే రవితేజ 67వ సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇక 68వ సినిమా త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ కూడా షూటింగ్ దశలో ఉంది. రవితేజ 69వ సినిమా శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ని కూడా అనౌన్స్ చేశారు.
Pushpa : ‘పుష్ప’ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నా అంటున్న జెనీలియా భర్త
ఇప్పటికే ఈ సినిమా కూడా షూటింగ్ మొదలైనట్టు సమాచారం. “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. రేపు డిసెంబర్ 6న ఉదయం 10గంటల 8నిమిషాలకు ఈ సినిమా నుంచి ఓ మాసివ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు సినిమా బృందం ప్రకటించింది. మరి ఆ మాసివ్ అప్డేట్ ఏంటో వేచి చూడాలి. ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించడం విశేషం.
A MASSive Announcement Landing Tomorrow at 10:08 AM ??#RamaRaoOnDuty @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @Cinemainmygenes @sathyaDP @SamCSmusic @sahisuresh @RTTeamWorks pic.twitter.com/80lkUTmyLo
— SLV Cinemas (@SLVCinemasOffl) December 5, 2021