అరుణ్ ఖేతర్ పాల్ పాత్రలో వరుణ్ ధావన్

‘బద్లాపూర్‌’ తర్వాత దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్, హీరో వరుణ్‌ ధావన్‌, నిర్మాత దినేష్ విజన్ కాంబోలో యువ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ బయోపిక్‌కి రంగం సిద్ధమైంది..

  • Publish Date - October 15, 2019 / 04:59 AM IST

‘బద్లాపూర్‌’ తర్వాత దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్, హీరో వరుణ్‌ ధావన్‌, నిర్మాత దినేష్ విజన్ కాంబోలో యువ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ బయోపిక్‌కి రంగం సిద్ధమైంది..

బాలీవుడ్‌లో బయోపిక్‌లకు చక్కటి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే పలు బయోపిక్స్ సెట్స్‌పై ఉన్నాయి.. మరికొన్ని రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మరో బయోపిక్ తెరమీదకు రానుంది. 1971 ఇండో – పాక్ యుద్ధంలో వీర మరణం పొందిన యువ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ బయోపిక్‌కి రంగం సిద్ధమైంది. కేవలం 21 ఏళ్లలోనే శత్రు దేశాన్ని గడగడలాడించిన యువ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ పాత్రలో వరుణ్ ధావన్ కనిపించబోతున్నాడు.

‘బద్లాపూర్‌’ తర్వాత దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్, హీరో వరుణ్‌ ధావన్‌, నిర్మాత దినేష్ విజన్ ఈ సినిమా కోసం పనిచేయనున్నారు. భారత ఆర్మీకి గుర్తిండిపోయే సేవలందించి శత్రుదేశంపై వీరోచితంగా యుద్ధం చేసిన అరుణ్ ఖేతర్‌‌పాల్ ధైర్య సాహసాలకు మరణాంతరం భారత ప్రభుత్వం ‘పరమవీర చక్ర’ను ప్రకటించారు.

Read Also : చియాన్ సినిమాలో ఇర్ఫాన్

‘సైనికుడి పాత్రలో నటించాలన్నది నా కల. ఈ సినిమాతో అది నెరవేరబోతోంది. ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైనది. శ్రీరామ్‌ రాఘవన్‌గారితో మరోసారి పనిచేయడం చాలా సంతోషం’ అని వరుణ్‌ ధావన్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మ్యాడాక్ ఫిలింస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుంది. వరుణ్ ధావన్ నటించిన ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3D’, ’కూలీ నెం.1’ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.