Anudeep : అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ప్రసిడెంట్ అనుదీప్.. ఆహా.. జాతి రత్నాలు డైరెక్టర్ మామూలోడు కాదుగా..

అనుదీప్ ప్రస్తుతం దర్శకుడిగా విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు.(Anudeep)

Anudeep

Anudeep : జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ గా అనుదీప్ గుర్తింపు తెచ్చుకుంటే తన ఇంటర్వ్యూలు, టీవీ షోలలో తను చేసే కామెడీ, సినిమా ఈవెంట్స్ లో అనుదీప్ మాటలతో బాగా వైరల్ అయి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనుదీప్ ప్రస్తుతం దర్శకుడిగా విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు.(Anudeep)

అనుదీప్ తాజాగా కిష్కింధపురి సినిమా సక్సెస్ ఈవెంట్లో పాల్గొన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కిష్కింధపురి సినిమా మంచి విజయమే అందుకుంది. నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకులు అనుదీప్, అనిల్ రావిపూడి, బాబీ హాజరయ్యారు.

Also Read : Deepika Padukone : కల్కి నుంచి దీపికాను అందుకే తీసేసారా? ప్రభాస్ కూడా అడగలేదు కానీ దీపికా అడిగిందట.. ఫ్యాన్స్ కూడా హ్యాపీ..

ఈ ఈవెంట్లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. నేను, అనుదీప్, అనిల్ రావిపూడి ముగ్గురం కలిసే సినిమా చూసాము. అనుదీప్ స్క్రీన్ పైకి అనుపమ పరమేశ్వరన్ రాగానే అరుస్తూనే ఉన్నాడు. నేను, అనిల్ హీరో ఎంట్రీ కి కదా అరిచేది అనుదీప్ ఏంటి అనుపమకు అరుస్తున్నాడు అనుకున్నాము. అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ప్రసిడెంట్ అనుకుంట అనుదీప్. అందుకే ఇవాళ సక్సెస్ మీట్ లో అనుపమ రాలేదని తక్కువ మాట్లాడి మైక్ ఇచ్చేసాడు అని సరదాగా అన్నాడు. దీంతో అనుపమ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నాడు.