Anupam Kher : న‌కిలీ రూ.500 నోట్ల‌పై బాలీవుడ్ న‌టుడు అనుమ‌ప్ ఖేర్ ఫోటో.. స్పందించిన న‌టుడు

న‌కిలీ క‌రెన్సీ క‌ల‌క‌లం రేపుతోంది.

Anupam Khers face on fake currency notes

న‌కిలీ క‌రెన్సీ క‌ల‌క‌లం రేపుతోంది. కొంద‌రు న‌కిలీ నోట్ల‌ను ముద్రించి మార్కెట్‌లో చ‌లామ‌ణీ చేస్తున్నారు. న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం, ఆర్‌బీఐ ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికి వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించ‌లేక‌పోతున్నాయి. తాజాగా న‌కిలీ క‌రెన్సీ ముఠా గుట్టును ర‌ట్టు చేశారు అహ్మ‌దాబాద్ పోలీసులు. అయితే.. ఈ నోట్ల‌ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈనోట్ల‌పై గాంధీ చిత్రానికి బ‌దులుగా బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో ఉంది.

నోట్లపై ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు. నిందితులు ఈ నోట్ల‌ను ఉప‌యోగించి 2100 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ప‌లువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన నకిలీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Pawan Kalyan : కీరవాణికి ధన్యవాదాలు చెప్పిన డిప్యూటీ సీఎం.. ‘ఓం నమో నారాయణాయ’ మంత్రం ఆడియో రూపొందించినందుకు..

న‌కిలీ క‌రెన్సీకి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీనిపై న‌టుడు అనుప‌మ్ ఖేర్ స్పందించారు. రూ.500 నోట్ల‌పై గాందీజీ ఫోటోకు బదులుగా నా ఫోటోనా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. ఏదైనా జ‌ర‌గొచ్చు. అంటూ రాసుకొచ్చారు.