Anupama Parameswaran
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ తనపై, తన కుటుంబంపై కావాలని ఒక సోషల్ మీడియా అకౌంట్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని, తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తుందని సైబర్ పోలీసులకు ఇటీవల కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు దీనిపై విచారణ జరిపి ఆ అకౌంట్ వెనక ఉన్నవాళ్ళను పట్టుకున్నారు. ఈ ఘటనపై అనుపమ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(Anupama Parameswaran)
అనుపమ పరమేశ్వరన్ చేసిన పోస్ట్ లో.. కొన్ని రోజుల క్రితం ఒక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నా గురించి, నా కుటుంబం గురించి చాలా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తుందని, నా ఫ్రెండ్స్, సహ నటులను ట్యాగ్ చేసి ఆ పోస్టులు పెడుతున్నారని నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌లలో మార్ఫింగ్ చేసిన నా ఫొటోలు, నిరాధారమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలా లక్ష్యంగా చేసుకొని వేధింపులు చేయటం చాలా బాధాకరం. నాకు సంబంధించిన ప్రతి పోస్ట్‌పై హానికరమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏకైక ఉద్దేశ్యంతో ఒక వ్యక్తి అనేక నకిలీ ఖాతాలను సృష్టించాడని విచారణలో తేలింది. దీని గురించి తెలుసుకున్న వెంటనే నేను కేరళలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాను.
Also Read : Suma Kanakala : యాంకర్ సుమకు ఈ రికార్డ్ కూడా ఉందా? అప్పట్లోనే అమెరికాలో..
వాళ్ళు ఫాస్ట్ గా స్పందించి ఇలా చేసే వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించారు. ఆశ్చర్యకరంగా అది తమిళనాడుకు చెందిన ఒక 20 ఏళ్ల అమ్మాయి అని తేలింది. ఆమె చిన్న వయస్సును దృష్టిలో ఉంచుకుని, ఆమె భవిష్యత్తును, మనశ్శాంతిని ఆలోచించి నేను ఆమె గుర్తింపును వెల్లడించకూడదని నిర్ణయించుకున్నాను. ఈ సంఘటనతో ఒక విషయం మాత్రం చెప్పదలచుకున్నాను. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఇతరులపై వేధించే, పరువు తీసే, ద్వేషాన్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ ఉండదు అని తెలిపింది. మేము చట్టపరమైన చర్య తీసుకున్నాము, వాళ్ళు చేసిన చర్యలకు పరిణామాలను ఎదుర్కొంటాడు. సైబర్ బెదిరింపు శిక్షార్హమైన నేరం అని తెలిపింది.