Anupama Parameswaran Janaki vs State of Kerala
సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె. ఫణీంద్ర కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది. లాయర్ గా సురేష్ గోపి కనిపించనున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
NKR 21 : కళ్యాణ్‌రామ్ మూవీలో బాలీవుడ్ నటుడు.. లుక్ అదిరింది బాసూ!
తాజాగా ఈ చిత్ర బృందం నుంచి సాలీడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2025లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
Upendra UI Movie : ‘యూఐ’ మూవీ రివ్యూ.. ఇదేం సినిమారా బాబు.. ఉప్పి ఈజ్ బ్యాక్..