NKR 21 : క‌ళ్యాణ్‌రామ్ మూవీలో బాలీవుడ్ న‌టుడు.. లుక్ అదిరింది బాసూ!

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న హీరోల్లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఒక‌రు

NKR 21 : క‌ళ్యాణ్‌రామ్ మూవీలో బాలీవుడ్ న‌టుడు.. లుక్ అదిరింది బాసూ!

Sohail Khan stylish look out from NKR 21

Updated On : December 20, 2024 / 1:53 PM IST

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న హీరోల్లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఒక‌రు. ఆయ‌న ప్రదీప్ చిలుకూరి డైరెక్ట‌న్‌లో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. NKR21 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సోహైల్ ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. నేడు (డిసెంబ‌ర్ 20) సోహైల్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఈ మూవీలోని ఆయ‌న లుక్‌ను రివీల్ చేశారు. సూపర్ స్టైలిష్‌గా ఆయ‌న క‌నిపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంతోనే ఆయ‌న తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు.

Upendra UI Movie : ‘యూఐ’ మూవీ రివ్యూ.. ఇదేం సినిమారా బాబు.. ఉప్పి ఈజ్ బ్యాక్..

క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న సాయి మంజ్రేకర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తోండ‌గా విజ‌య‌శాంతి, శ్రీకాంత్‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.