Sohail Khan stylish look out from NKR 21
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఆయన ప్రదీప్ చిలుకూరి డైరెక్టన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు. NKR21 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు (డిసెంబర్ 20) సోహైల్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ మూవీలోని ఆయన లుక్‌ను రివీల్ చేశారు. సూపర్ స్టైలిష్‌గా ఆయన కనిపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంతోనే ఆయన తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
Upendra UI Movie : ‘యూఐ’ మూవీ రివ్యూ.. ఇదేం సినిమారా బాబు.. ఉప్పి ఈజ్ బ్యాక్..
కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తోండగా విజయశాంతి, శ్రీకాంత్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Wishing the evildoer in #NKR21, @SohailKhan a very Happy Birthday ❤️🔥
Welcome to Telugu Cinema, sir. We are delighted to have you on board ✨@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981 #AshokMuppa @AJANEESHB @AshokaCOfficial pic.twitter.com/UKERb065Jj
— NTR Arts (@NTRArtsOfficial) December 20, 2024