Anupama Parameswaran : అప్పుడేమో ఛాలెంజింగ్ గా తీసుకుంది.. ఇప్పుడేమో అనవసరంగా చేసాను అంటుంది..

తాజాగా పరదా సినిమా ప్రమోషన్స్ లో అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమా గురించి మాట్లాడింది.

Anupama Parameswaran

Anupama Parameswaran : మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పరదా సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో అనుపమ పరమేశ్వరన్ బిజీగా ఉంది. గతంలో అనుపమ సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ బోల్డ్ రోల్ లో నటించింది. లిప్ కిస్ లతో పాటు, రొమాన్స్, షార్ట్ డ్రెస్ లు.. ఇలా సినిమా అంతా హాట్ గా కనిపిస్తూ బాగా వైరల్ అయింది. అప్పటిదాకా సింపుల్ గా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ని ఆ రేంజ్ బోల్డ్ పాత్రలో చూసి తట్టుకోలేకపోయారు ఫ్యాన్స్. ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. ఆ సినిమా ప్రమోషన్స్ లో అన్ని పాత్రలు చేయాలి, ఈ పాత్ర చాలెంజింగ్ గా తీసుకొని చేశాను అని చెప్పుకొచ్చింది.

Also Read : Coolie : రజినీకాంత్ ‘కూలీ’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లు? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి?

అయితే తాజాగా పరదా సినిమా ప్రమోషన్స్ లో అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమా గురించి మాట్లాడింది. అనుపమ మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీ పాత్ర చేయడం నా అభిమానులకు నచ్చలేదు. వాళ్ళకే కాదు నాకు కూడా నచ్చలేదు. ఆ పాత్ర చేయడం తప్పు కాదు కానీ చేయకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది. ఆ సినిమా చేయడానికి చాలా ఆలోచించి ఒక ఛాలెంజిగ్ గా తీసుకొని చేద్దాం అని చేసాను. ఆ సినిమా ఒప్పుకున్నా సెట్స్ లోనే కాన్ఫిడెంట్ గా లేను. సినిమాలో, ప్రమోషన్స్ లో కూడా ఆ డ్రెస్ లలో నేను కంఫర్ట్ గా లేను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఏమనుకుంటారో అని భయమేసింది. అనుకున్నట్టే విమర్శలు వచ్చాయి అని తెలిపింది.

అయితే అప్పుడేమో ఛాలెంజింగ్ గా తీసుకొని నటించాను అని చేపి ఇప్పుడు అనవసరంగా ఆ పాత్ర చేసాను అని చెప్పడంతో అనుపమ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి అనుపమ వ్యాఖ్యలపై సిద్ధూ కానీ,మూవీ యూనిట్ కానీ స్పందిస్తారేమో చూడాలి.

Also Read : Annapurna Studios : ఈ ఫొటోకు 50 ఏళ్ళు.. హైదరాబాద్ లో సినీ అభివృద్ధికి ఇక్కడే బీజం.. ఈ ఫొటోలో ఉన్న బాబు ఏ హీరోనో తెలుసా?