Anurag Kulkarni
Anurag Kulkarni : టాలీవుడ్ స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరాలు గత సంవత్సరం నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యలో సింపుల్ గా జరిగింది. వీరి పెళ్లి గురించి అనురాగ్, రమ్య బెహరా ఎక్కడా మాట్లాడలేదు. వీరి పెళ్లి ఫొటోలు కూడా అధికారికంగా బయటపెట్టలేదు. కానీ ఒక ఫోటో మాత్రం లీక్ అయి వైరల్ అయింది.(Anurag Kulkarni)
తాజాగా సింగర్ అనురాగ్ కులకర్ణి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన పెళ్లిపై స్పందించాడు.
Also Read : Peddi Song : చికిరి.. చికిరి.. పాటకు బామ్మా స్టెప్పులు అదుర్స్.. చరణ్ ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్..
అనురాగ్ కులకర్ణి మాట్లాడుతూ.. రమ్య వాళ్ళు మా అమ్మ తరుపున చుట్టాలు అవుతారు. ఒక ఫంక్షన్ లో మా పెద్దవాళ్ళు మాట్లాడుకొని మా సంబంధం ఫిక్స్ చేసారు. మా పెళ్లి ప్రాసెస్ చాలా పెద్దది. ఒక 12 గంటలు జరుగుతుంది. ఎవర్ని పిలిచినా వాళ్ళను ప్రాపర్ గా ట్రీట్ చేయలేను ఆ బిజీలో. అందుకే పిలవలేదు ఎవర్ని. అలాగే నా పేరెంట్స్, నా పర్సనల్ లైఫ్ నేను ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇది కూడా అంతే. చాలా మంది సీక్రెట్ గా చేసుకున్నారు, ఎవరికీ తెలియకుండా చేసుకున్నారు అని ఇంకా ఏదేదో అని రాసారు. నా పర్సనల్ లైఫ్ ప్రైవేట్ గా పెట్టాలి అని నా అభిప్రాయం. అది పూర్తిగా అరేంజ్డ్ మ్యారేజ్. అసలు లవ్ మ్యారేజ్ కాదు.
నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేసేటప్పుడు వేరే సింగర్స్ ద్వారా మొదట పరిచయం అయింది రమ్య. మేమిద్దరం ఒకే ప్రొఫెషన్, అందరికి తెలుసు కాబట్టి అందరూ లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. కానీ ఇది అరేంజ్డ్ మ్యారేజ్. మేము కలిసి పనిచేసాము. మేమిద్దరం కలిసి ఒక 8 పాటలు వరకు పాడాము. ప్రస్తుతం ఇద్దరం వర్క్ తో బిజీగా ఉన్నాము. వర్క్ లో తను చాలా సీనియర్. నా కంటే ఆరేడేళ్లు ముందు నుంచే పాడుతుంది. మేము ఇద్దరం కలిసి కూర్చునే టైం చాలా తక్కువ. మా ఇద్దరి మధ్య కెరీర్ గురించి డిస్కషన్స్ ఎక్కువ జరగవు అని తెలిపారు. మొత్తానికి అనురాగ్ – రమ్య పెళ్లిపై అయితే ఇది లవ్ మ్యారేజ్ కాదు అని క్లారిటీ వచ్చింది.