యాడ్‌లో..: పోలీస్‌గా అనుష్క

ఫ్యాషన్ బ్రాండ్స్ డ్రెస్ యాడ్‌ల తర్వాత అనుష్క శర్మ పోలీస్ గెటప్ లో కనిపించింది. ఓ బిల్డింగ్‌లో కొందరు వ్యక్తులు తింటుండగా అరెస్టు వారెంట్‌తో అనుష్క ఎంటరవుతుంది. ఎవ్వరూ కదలడానికి వీల్లేదని చెప్పి తనతో పాటు తెచ్చిన పోలీస్ కుక్కతో ఇన్వెస్టిగేషన్‌కు ముందుకెళ్తోంది. 

ఓ శానిటరీ వేర్ అడ్వర్టైజ్‌మెంట్‌లో భాగంగా చేసిన వీడియోలో  బాత్రూం దగ్గర్లోకి రాగానే అనుకోకుండా కాలు పెట్టేస్తుంది. అలా వెళ్లడంతోనే ట్యాప్‌లు, వాష్ బేసిన్లు చూసి తనను తాను మరిచిపోతుంది. షవర్ ఆన్ చేసుకుని డ్యాన్స్‌ చేస్తుంది. చిందులేస్తూ బాత్రూం దగ్గరకు వెళ్లేసరికి ఇంటి ఓనర్ వస్తాడు. 

దాంతో బాత్రూం ఎక్కడిది అని అడిగితే ఆ ఇంటి పనివాడు వచ్చి కంపెనీ పేరు చెప్తాడు. అంతే నైస్‌గా బాత్రూం అనుకుంటూ వచ్చిన పనికూడా మర్చిపోయి వెళ్లిపోతుంది. బయటికి వెళ్లాక కానిస్టేబుల్ ఏమైనా దొరికిందా అని అడిగితే నైస్ బాత్రూం కనిపించిందని చెప్తూ వెళ్లిపోతుంది. ఈ వీడియో పోస్టు చేసిన గంట వ్యవధిలోనే నాలుగున్నర లక్షలకు పైగా ప్రేక్షకులను సంపాదించుకుంది.