Anushka Ghaati : అనుష్క శెట్టి మళ్ళీ ఇదివరకులా బిజీ అవుతుంది. తాజాగా నేడు తన పుట్టిన రోజు కావడంతో తన సినిమాల నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఘాటీ ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
నేడు ఉదయం ఈ సినిమా నుంచి అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా తాజాగా ఘాటీ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో.. అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్టు దారుణంగా చూపించారు. అనుష్కను మాస్ ఎలివేషన్ తో చూపించారు. దీంతో ఘాటీ సినిమా కథేంటి, అనుష్క పాత్రేంటి అని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్టు సమాచారం.
మీరు కూడా అనుష్క ఘాటీ గ్లింప్స్ చూసేయండి..
https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls