Ghaati release glimpse : అనుష్క ‘ఘాటి’ రిలీజ్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. ప్ర‌భాస్ చేతుల మీదుగా..

అనుష్క శెట్టి న‌టిస్తున్న మూవీ ఘాటి. శుక్ర‌వారం విడుద‌ల సంద‌ర్భంగా చిత్రబృందం గురువారం రిలీజ్ గ్లింప్స్‌(Ghaati release glimpse)ను..

Anushka Shetty Ghaati release glimpse out now

Ghaati release glimpse : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి న‌టిస్తున్న మూవీ ఘాటి. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు చిత్రంపై అంచ‌నాల‌ను పెంచేశాయి. శుక్ర‌వారం విడుద‌ల సంద‌ర్భంగా చిత్రబృందం గురువారం రిలీజ్ గ్లింప్స్‌(Ghaati release glimpse)ను విడుద‌ల చేసింది. ఈ గ్లింప్స్‌ డార్లింగ్ ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుద‌లైంది.

Genelia : ఆహా సింగింగ్ షో కోసం వచ్చిన ‘హాసిని’.. జెనీలియా క్యూట్ ఎపిసోడ్..

ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. విక్రమ్ ప్రభు, జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వేదం తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.