అనుష్క శెట్టి తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారు..
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఊపు ఊపుతున్నారు. వర్కౌట్స్, కుకింగ్, ఇంటి పనులు ఇలా ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా అనుష్క శెట్టి పోస్ట్ చేసిన ఫ్యామిలీ పిక్ వైరల్ అవుతోంది.
ఎప్రిల్ 20న తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. తల్లిదండ్రులు ప్రఫుల్లా, విఠల్ శెట్టిలతో తీసుకున్న సెల్ఫీను స్వీటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పేరెంట్స్‌తో పాటు సాంప్రదాయ చీరకట్టులో కనిపించింది. అనుష్క మొదటినుండి సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటుంది.
అడపాదడపా సోదరుడితో తీసుకున్న పిక్స్ షేర్ చేస్తుంటుంది. ఇప్పుడు పేరెంట్స్‌తో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది.