AP Fiber Net Legal Notice to Director RGV Regarding Vyuham Movie
RGV : గతంలో డైరెక్టర్ ఆర్జీవీ ఎన్నికల ముందు వ్యూహం అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయి వెంటనే ఏపీ ఫైబర్ నెట్ లో రిలీజయింది. అయితే అప్పటి ప్రభుత్వం, ఏపీ ఫైబర్ నెట్ ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ డబ్బులు వ్యూహం సినిమాకు గాను ఆర్జీవికి చెల్లించారని తాజాగా ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ ఆర్జీవికి, అప్పటి ఫైబర్ నెట్ ఎండీకి, మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు.
Also Read : Pawan Kalyan : నన్ను పని చేసుకోనివ్వండి.. నేను మీసం తిప్పితే, మీరు OG అని అరిస్తే పనులు జరగవు..
ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి మాట్లాడుతూ.. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందినందుకు ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు ఇచ్చాము. ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయి. ‘వ్యూహం’ సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు చెల్లించారు. ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు 11 వేల రూపాయలు చెల్లించారు. రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై వివరణ కోరుతూ డైరెక్టర్ ఆర్జీవీకి లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.