Mana Shankara Vara Prasad Garu
Mana Shankara Vara Prasad Garu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వెంకటేష్ గెస్ట్ రోల్ లో తెరకెక్కిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 12 న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఇక భారీ సినిమాలకు, స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే.(Mana Shankara Vara Prasad Garu)
ఇటీవల ఏపీలో రాజాసాబ్ సినిమాకు టికెట్ రేట్లు భారీగా పెంచి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు కూడా టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్స్ కి అనుమతులు ఇచ్చారు.
మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు ఏపీ ప్రభుత్వం జనవరి 11న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య స్పెషల్ షోకు అనుమతి ఇచ్చింది. స్పెషల్ షో టికెట్ ధరను 500 రూపాయలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జనవరి 12 నుంచి 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 125 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రోజుకు 5 షోల వరకు అనుమతి ఇచ్చారు.
అయితే తెలంగాణ లో మాత్రం టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. రాజాసాబ్ సినిమాకు రిలీజ్ కి ముందు రోజు అర్దరాత్రి టికెట్ పెంపు ఇచ్చినా తెల్లారి హైకోర్టు ఆ అనుమతులను కొట్టేసింది. దీంతో తెలంగాణలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఉండదనే సమాచారం.