AR Murugadoss: మహేష్ తో చేస్తాడా.. మళ్ళీ అదే హీరో రిపీట్ అవుతాడా? కన్ఫ్యూజన్ లో మురుగదాస్

గజినీ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఇండుస్త్రీలను తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్(AR Murugadoss). షార్ట్ టర్మ్స్ మెమరీ లాస్ అంటే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.

AR Murugadoss is doing another film with Siva Karthikeyan.

AR Murugadoss: గజినీ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఇండుస్త్రీలను తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్. షార్ట్ టర్మ్స్ మెమరీ లాస్ అంటే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత కూడా అదే పంధాను కొనసాగించాడు ఈ దర్శకుడు. వరుస విజయాలు అందుకున్నాడు. కానీ, ఏమైందో తెలియదు ఈ మధ్య అయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇటీవలే ఏ ఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వంలో వచ్చిన మూవీ మదరాసి. తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరో గా వచ్చిన ఈ సినిమా ఓ మోస్తారు విజయాన్ని సాధించింది.

Keerthy Suresh: అదో కొత్త ప్రయాణం.. కానీ, ఆస్వాదిస్తున్నా.. కీర్తి సురేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

అయితే, ఈ సినిమా తరువాత మురుగదాస్ చేయబోయే సినిమా గురించి ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే, మురుగదాస్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. 2017 భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా తరువాత నుంచే మురుగదాస్ హిట్ దూరం అయ్యింది. అయితే, ఆ సినిమా విడుదల సమయంలోనే మహేష్ బాబుతో మరో సినిమా చేసి సూపర్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట మురుగదాస్. దానికి మహేష్ బాబు కూడా ఒకే చెప్పాడట.

ఈ నేపధ్యంలోనే తాజాగా మహేష్ బాబు ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ని రెడీ చేశాడట ఈ దర్శకుడు. కాకపోతే, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవడానికి మరో సంవత్సరమైనా పెట్టె అవకాశం ఉంది. పోనీ ఆ సినిమా విడుదల వరకు ఆగుదాం అంటే, ఆ రేంజ్ సినిమా తరువాత మహేష్ మురుగదాస్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అనేది మరో డౌట్. అందుకే, మహేష్ కోసం రాసుకున్న కథను ఇటీవల మదరాసి సినిమాతో తణుకు డీసెంట్ హిట్ అందించిన శివ కార్తికేయన్ కి వినిపించాడట. ఆ కథ విపరీతంగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని టాక్.