×
Ad

Ariyana Glory : అమర్ దీప్ వల్లే నా మతం మారింది.. పళని సుబ్రహ్మణ్య స్వామి నా జీవితాన్ని మార్చేశాడు..

అరియనా గ్లోరీ పళనితో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఏర్పడిన అనుబంధం గురించి చెప్పింది. (Ariyana Glory)

Ariyana Glory

Ariyana Glory : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియనా తర్వాత సోషల్ మీడియా, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలో క్యారెక్టర్స్ చేస్తుంది. తాజాగా అరియనా గ్లోరీ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Ariyana Glory)

ఈ క్రమంలో అరియనా గ్లోరీ పళనితో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఏర్పడిన అనుబంధం గురించి చెప్పింది.

Also Read : Nilakanta : ‘నీలకంఠ’ ట్రైలర్ రిలీజ్.. రీ ఎంట్రీ ఇస్తున్న స్నేహ ఉల్లాల్..

Ariyana Glory

అరియనా ఆగ్లోరీ మాట్లాడుతూ.. నా లైఫ్ లో టెంపుల్స్ కి వెళ్లడం అలవాటైంది అమర్ దీప్ వల్లే. నీ వల్లే నా మతం మార్చేసాను అని అమర్ దీప్ తో అంటాను. శివుడి టెంపుల్స్ కి వెళ్ళాను. అనుకోకుండా అరుణాచలం వెళ్ళాను అమర్ దీప్ తో. ఆ తర్వాత మూడు సార్లు అనుకోకుండానే అరుణాచలం వెళ్ళాను. మూడు సార్లు గిరి ప్రదక్షణ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా పళనికి వెళ్ళాను. ప్రస్తుతం సుబ్రమణేశ్వర స్వామి ట్రాన్స్ లో ఉన్నాను. నాకు ఆయన చాలా ఇష్టం. పళని గుడిలోకి వెళ్ళాక ప్రశాంతత వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మొదటిసారి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడటం అదే.

పళనిలో నేను ఒక మొక్కు మొక్కుకున్నాను. తర్వాత అక్కడ ఓ పంతులు వచ్చి మీరు అనుకున్నది మూడు నెలల్లో జరుగుతుంది అన్నారు. అది జరిగింది. నేను పళని నుంచి వచ్చాక వారం రోజుల దాకా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేదు. మళ్ళీ పళని కి వెళ్దాం అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు. ఒకసారి వెళదామని బయలుదేరి సగం దూరం వెళ్లి వచ్చేసాను. తర్వాత నా పనుల్లో నేను బిజీ అయిపోయాను. ఓ రోజు నా ఫ్రెండ్ శేఖర్ అని ఇంటికి వచ్చి ఒక టెంపుల్ కి వెళ్తే అక్కడ పంతులు అరియనాని పళని వెళ్ళమని చెప్పాడని చెప్పాడు. నేను షాక్ అయ్యా. వెళదాం అనుకుని వెళ్ళలేదు కాబట్టి శేఖర్ చెప్పగానే ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసి పళనికి వెళ్లి వచ్చా. పళని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను చాలా మార్చింది. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాక నా జీవితం చాలా మారింది.

Also Read : Posani Krishna Murali: పోసాని హీరోగా కొత్త మూవీ.. పొలిటికల్ రీఎంట్రీ పై ఆసక్తికర కామెంట్స్..

ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కరుంగలి మాల అందరూ వేసుకుంటున్నారు. నన్ను దాని గురించి ఒక ఫ్రెండ్ అడిగితే తెలీదు అన్నాను. సుబ్రహ్మణ్య స్వామి కరుంగలి మాల తెలీదా అన్నారు. దాంతో ఆ మాల కావాలి ఎలా తెప్పించుకోవాలో తెలీదు అనుకున్న సమయంలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి కరుంగలి మాల తెప్పించుకుంటున్నా నీకు కావాలా అని అడిగాడు. కావాలి అని చెప్పిన రెండు వారాల్లో మా ఇంటికి వచ్చింది అని తెలిపింది. అలా సుబ్రహ్మణ్య స్వామి వల్ల నా లైఫ్ లో చాలా మారాయి అని చెప్పింది అరియనా.