Arjun Das viral tweet on Pawan Kalyan OG movie scenes
Pawan Kalyan – Arjun Das : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ OG. సాహూ ఫేమ్ సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పూర్తి యాక్షన్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నాడు. పంజా సినిమా తరువాత పవన్ ని మళ్ళీ అటువంటి సినిమాల్లో చూడలేదు అభిమానులు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగట్టే సుజిత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని పాత్రలో కోసం.. అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, ఇమ్రాన్ హష్మి వంటి స్టార్ క్యాస్ట్ ని ఎంచుకొని ఆసక్తిని కలగజేశాడు.
Allu Arjun – Vijay : అల్లు అర్జున్ సాంగ్‌కి విజయ్ స్టెప్పులు.. పూజా హెగ్డే షేర్ చేసిన వీడియో వైరల్!
ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాది చివరిలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ మూవీ ఎడిటింగ్ పనులను కూడా మరోపక్క సాగిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలను అర్జున్ దాస్ చూశాడట. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. “OG లోని కొన్ని సీన్స్ చూశాను. డిఓపి రవి చంద్రన్ సార్ విజువల్స్, పవన్ కళ్యాణ్ సార్ స్క్రీన్ ప్రెజన్స్, స్వాగ్, డైలాగ్స్.. చూసి నా మైండ్ బ్లాక్ అయ్యింది. నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి. సుజిత్, పవన్, డివివి సంభవంలో ఫైర్ స్ట్రోమ్ కమ్మింగ్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
????????????????. Avan Cinema…. Rampppp Ramppppp yee!! #OG #FireStormIsComing https://t.co/pCJop5l2Rl
— DVV Entertainment (@DVVMovies) June 23, 2023
కాగా ఈ సినిమాలో పవన్ పేరు ‘గాంధీ’ అంటూ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న పవన్.. అది ముగించుకొని OG సెట్స్ లోకే అడుగుపెట్టబోతున్నాడని తెలుస్తుంది. మరి హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) షూటింగ్స్ సంగతి ఏంటనేది తెలియడం లేదు.