×
Ad

Arjun Sarja : స్టార్ కమెడియన్ కొడుకుతో హీరో అర్జున్‌ కూతురు పెళ్లి..? ఆ వరుడు ఎవరో తెలుసా..!

యాక్షన్ హీరో అర్జున్ తన కూతుర్ని ఒక స్టార్ కమెడియన్ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ వరుడు ఎవరంటే..

  • Published On : June 25, 2023 / 06:16 PM IST

Arjun Sarja Daughter Aishwarya Thambi Ramaiah son Umapathy marriage news

Arjun Sarja : యాక్షన్ హీరో అర్జున్ కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపించేవారు. యాక్టర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా ఆకట్టుకున్నారు. ఇక ఆయన వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యిన హీరోయిన్ ‘ఐశ్వర్య సర్జా’. తమిళంలో హీరో విశాల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తరువాత కన్నడలో కూడా ఒక సినిమా చేసింది. ఇక తెలుగులో హీరోయిన్ గా పరిచయం అవుతూ ఒక సినిమా ప్రకటించిన అది అనౌన్స్‌మెంట్ తోనే ఆగిపోయింది.

SSMB 29 : మ‌హేశ్‌-రాజ‌మౌళి సినిమా క్లైమాక్స్ చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్..! పండ‌గే అంటున్న అభిమానులు

కాగా ఇప్పుడు ఐశ్వర్యకి సంబంధించిన ఒక న్యూస్ తమిళ్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. కొన్నాళ్ల నుంచి ఐశ్వర్య ఒక స్టార్ కమెడియన్ కొడుకుతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వీరిద్దరి ప్రేమకు రెండు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నెల్ రావడంతో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరని ఆలోచిస్తున్నారా? తమిళ పరిశ్రమలో తన కామెడీతో ఎంతోమంది అలరిస్తూ వస్తున్న ‘తంబి రామయ్య’ కుమారుడు ‘ఉమాపతి’ అని తమిళ్ మీడియా వర్గాలు రాసుకొస్తున్నాయి.

Samajavaragamana Trailer : శ్రీవిష్ణు కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన చిరు.. ఫ్యామిలీ సామజవరగమన మాములుగా లేదు!

అయితే దీని గురించి ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి సమాచారం లేదు. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాలి. కాగా ఉమాపతి తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ‘దేవదాస్’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఒక టెలివిజన్ షో కూడా చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే, అర్జున్ తన కూతుర్ని టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం చేయాలని చాలా ప్రయత్నించాడు. అందుకోసం తానే దర్శకత్వ భాద్యతలు కూడా తీసుకున్నాడు. విశ్వక్ సేన్ ని హీరోగా ఎంపిక చేసుకొని సినిమాని కూడా మొదలు పెట్టాడు. కానీ విశ్వక్ అండ్ అర్జున్ మధ్య విబేధాలు రావడంతో మూవీ ఆగిపోయింది.