Ameesha Patel : పవన్ హీరోయిన్ పై అరెస్ట్‌ వారెంట్.. కారణం ఏంటో తెలుసా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బద్రి సినిమాలో నటించిన అమిషా పటెల్‌ (Ameesha Patel) గుర్తుకు ఉండే ఉంటది. తాజాగా ఆమె పై అరెస్ట్‌ వారెంట్ జారీ అయ్యింది.

Arrest warrant issued on Pawan Kalyan badri movie heroine Ameesha Patel

Ameesha Patel : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బ్లాక్ బస్టర్ మూవీ బద్రి సినిమాలో నటించిన అమిషా పటెల్‌ (Ameesha Patel) అందరికి గుర్తుకు ఉండే ఉంటది. బాలీవుడ్ భామ అయిన అమిషా బద్రి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత మహేష్ బాబు – నాని, ఎన్టీఆర్ – నరసింహుడు, బాలకృష్ణ – పరమవీరచక్ర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే నటిస్తున్న ఈ భామ పై చెక్‌ బౌన్స్‌ కేసు విషయంలో అరెస్ట్‌ వారెంట్ ఫైల్ అయ్యింది. రాంచీకి చెందిన అజయ్ కుమార్ సింగ్‌ అనే వ్యక్తి సినిమాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమిషాని సంప్రదించాడు.

Pawan Kalyan : ‘గేమ్ ఛేంజర్’ పవన్ కళ్యాణ్‌తో తీద్దామన్నారు శంకర్.. దిల్ రాజుని ట్రోల్ చేస్తున్న పవన్ అభిమానులు..

ఈ నేపథ్యంలోనే ‘దేశీ మ్యాజిక్’ అనే సినిమాని తెరకెక్కించేందుకు అజయ్ కుమార్ నుంచి అమీషా 2.5 కోట్లు అందుకుంది. ఒప్పందం ప్రకారమే 2013లో ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించింది అమిషా. ఏళ్ళు గడుస్తున్న సినిమా మాత్రం పూర్తి కాకపోవడంతో తన డబ్బుని వెన్నకి తిరిగి ఇవ్వాలని అజయ్ కోరాడు. దీంతో అమీషా.. అజయ్ కు 2.5 కోట్ల చెక్ ఒకటి, 50 లక్షలకు మరో చెక్‌ ని ఇచ్చింది. అయితే ఆ చెక్ లు బౌన్స్ అవ్వడంతో అజయ్ సింగ్ కోర్ట్ ని ఆశ్రయించాడు. అమిషా పటెల్‌ మరియు ఆమె బిజినెస్‌ పార్ట్‌నర్‌ క్రునాల్‌ పై రాంచీ సివిల్‌ కోర్టులో కేసు ఫైల్ చేశాడు.

తాజాగా ఈ కేసు పై విచారణ జరిపిన కోర్ట్ అమిషా పటెల్‌ పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 420, 120 సెక్షన్ల కింద ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌ 15న జరగనుంది. గతంలో కూడా ఇటువంటి కేసులో అమిషా పై కేసు నమోదు అయ్యినట్లు సమాచారం.