Pawan Kalyan : ‘గేమ్ ఛేంజర్’ పవన్ కళ్యాణ్‌తో తీద్దామన్నారు శంకర్.. దిల్ రాజుని ట్రోల్ చేస్తున్న పవన్ అభిమానులు..

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చంజర్ సినిమా గురించి మాట్లాడారు.

Pawan Kalyan : ‘గేమ్ ఛేంజర్’ పవన్ కళ్యాణ్‌తో తీద్దామన్నారు శంకర్.. దిల్ రాజుని ట్రోల్ చేస్తున్న పవన్ అభిమానులు..

Shankar wants to make Game Changer with Pawan Kalyan but Dil Raju Suggest Ram Charan

Updated On : April 6, 2023 / 2:01 PM IST

Pawan Kalyan :  రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani) జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో RC15 సినిమా గేమ్ ఛేంజర్(Game Changer) భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి(Sankranthi) రిలీజ్ చేస్తారని గతంలో దిల్ రాజు ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమా షూట్స్ నుంచి లీక్ అయిన కొన్ని పిక్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం.

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ శంకర్ నాకు మొదట 45 నిమిషాల కథ వినిపించారు. పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా తీద్దాం అనుకున్నారు ఆయన. అదే నాకు చెప్పారు. కానీ ఈ కథకు చరణ్ సూట్ అవుతాడు అనిపించి నేనే చరణ్ ని సజెస్ట్ చేశాను. అయన కూడా ఒప్పుకోవడంతో ఈ సినిమా మొదలైంది అని తెలిపారు.

Shankar wants to make Game Changer with Pawan Kalyan but Dil Raju Suggest Ram Charan

Raviteja : బాలీవుడ్ యువ హీరోతో రవితేజ మల్టీస్టారర్? తెలుగు డైరెక్టర్ తో సినిమా..

దీంతో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇటీవల రీమేక్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. ఇప్పుడు దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా పవన్ తో తీద్దామంటే చరణ్ ని సజెస్ట్ చేశానని చెప్పడంతో పవన్ అభిమానులు దిల్ రాజుని ట్రోల్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ తో, కొత్త కథతో, పాన్ ఇండియా సినిమా పవన్ కి లేకుండా చేశావు, పవన్ అడిగితే చేసేవాడు కదా, పవన్ కి మంచి సినిమా మిస్ చేశావు.. అంటూ సోషల్ మీడియాలో దిల్ రాజుపై ట్రోల్స్ చేస్తున్నారు పవన్ అభిమానులు. మరి ఈ సంగతి చరణ్ కి తెలుసో లేదో.