మొన్నటి వరకు నార్త్‌లో సెలబ్రిటీల పెళ్ళిళ్లు వరుసగా జరిగాయి. ఇక ఇప్పుడు ఇద్దరు సౌత్ సెలబ్రిటీల మధ్య వివాహం జరగనుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. సైజ్ జీరో, రాజా రాణి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో ఆర్య(38).. అఖిల్ అనే చిత్రంతో టాలీవుడ్ అభిమానులని పలకరించిన సయేషా సైగల్(21)ని వివాహం చేసుకోనున్నాడట.
మొన్నటి వరకు ఫ్రెండ్స్‌గా ఉన్న వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని చెబుతున్నారు. మార్చి 9, 10 తేదీలలో వీరి వివాహం జరగనుందని కోలీవుడ్ మీడియా చెబుతుంది. 2018లో వచ్చిన గజినీకాంత్ అనే చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ప్రస్తుతం సూర్య-కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కప్పం చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
ఆర్య గతంలో తన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసి పెళ్లి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్స్ కానీ.. కండీషన్స్ కానీ లేవు. నేను మీకు నచ్చితే.. ఆ అమ్మాయికి చక్కటి జోడీ అవుతానని అనిపిస్తే నాకు కాల్ చేయండి అంటు ఓ నంబర్ కూడా పెట్టాడంట. ఇది ఫేక్ కాదు. నా లైఫ్ అని వీడియో ద్వారా తెలిపారు. వెంటనే అభిమానులందరు ఆ నంబర్‌కి కాల్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆర్య తాను అమ్మాయి కావాలని అంది రియల్ మ్యారేజ్ కోసం కాదు. రీల్ మ్యారేజ్ కోసం అని చెప్పి షాకిచ్చాడు. పూజ, త్రిష, నయనతారలతో పలు సినిమాలలో నటించిన ఆర్య.. యువ కథానాయికని పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని తమిళ తంబీలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఆర్య, సయేషాల పెళ్లి వేడుక జరపనుండగా, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని టాక్.