MEGA154: హీరోయిన్ దొరికేసినట్లే.. మెగాస్టార్ జోడీగా నివేదా?

సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్స్ సమస్య వేధిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ ఏమో ఫ్యాన్స్ ఫెడవుట్ అంటున్నారు. ఇప్పుడొచ్చే యంగ్ హీరోయిన్స్ ఏమో సీనియర్స్ పక్కన ఎబ్బెట్టుగా ఉంటుంది.

Mega154

MEGA154: సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్స్ సమస్య వేధిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ ఏమో ఫ్యాన్స్ ఫెడవుట్ అంటున్నారు. ఇప్పుడొచ్చే యంగ్ హీరోయిన్స్ ఏమో సీనియర్స్ పక్కన ఎబ్బెట్టుగా ఉంటుంది. మధ్యలో స్టార్ హీరోయిన్స్ డేట్స్ ఏమో దర్శకులకు దొరకట్లేదు. అందుకే తెలుగులో సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ హీరోయిన్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు.

Shruti Haasan : మెగాస్టార్‌కి జోడిగా కమల్ కూతురు..

చిరంజీవి మెగాస్టార్ అయినా హీరోయిన్స్ సమస్య మాత్రం కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం చిరంజీవి నటించే వాటిలో గాడ్ ఫాదర్ కోసం నయనతార తీసుకుంటే.. భోళాశంకర్ కోసం గతంలో సైరా నరసింహారెడ్డిలో నటించిన తమన్నాను రిపీట్ చేస్తున్నారు. ఇక బాబీ సినిమా MEGA154తో పాటు వెంకీ కుడుముల సినిమాలకు ఇంకా హీరోయిన్స్ ఫైనల్ కాలేదు. వెంకీ కుడుములు సినిమా కోసం మలయాళ భామ మాళవికా మోహనన్ ఫైనల్ చేసినట్లు వినిపిస్తుండగా.. బాబీ సినిమా కోసం ఇప్పటికే శృతిహాసన్ ను ఫైనల్ చేసుకున్నారు.

Chiru 154 : పూనకాలు లోడింగ్.. మాస్ బొమ్మలో బాస్..

కాగా ఇందులో మరో హీరోయిన్ కూడా ఉండగా అందుకోసం తమిళ భామ నివేదా పేతురాజ్ ఫైనల్ అయినట్లు వినిపిస్తుంది. ఇందులో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించనున్నాడు. దీంతో నివేదాను రవితేజ జోడీగా తీసుకున్నారా లేక చింరజీవి కోసమే మరో హీరోయిన్ పాత్ర ఉందా అన్నది క్లారిటీ లేదు. మెంటల్ మదిలో, అల వైకుంఠపురం, పాగల్, రెడ్ సినిమాల్లో నటించిన నివేతా పేతురాజ్ ఇప్పుడు విరాటపర్వంలో కూడా నటిస్తుంది. అల వైకుంఠపురంతో పాపులారిటీ సంపాదించుకున్న నివేతా పేతురాజ్‌కు ఈ సినిమాలో నివేదాకు ఛాన్స్ దక్కితే లక్ చిక్కినట్లే అని చెప్పుకోవాలి.