Ashu Reddy : నా లైఫ్ మొత్తంలో బావ అని పిలిచింది అతన్నే.. అతను హీరో మెటీరియల్.. స్టేజి మీద పులి..

తను బావ అని ఒక్కర్నే పిలుస్తాను అని తెలిపింది.

Ashu Reddy Calls Brother in Law only One Person in her Life

Ashu Reddy : సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ఇప్పుడు యాంకర్ గా, నటిగా పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపింది. తను బావ అని ఒక్కర్నే పిలుస్తాను అని తెలిపింది. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరో అనుకుంటున్నారా?

అషురెడ్డి మాట్లాడుతూ.. నా లైఫ్ లో మొత్తం మీద బావ అని పిలిచింది సుధీర్ ని ఒక్కడినే. ఫ్యామిలీ స్టార్ షో బావ, మరదళ్ల కాన్సెప్ట్ తోనే నడుస్తుంది. షో అంతా అతన్ని బావ అని పిలుస్తాను. నా రిలేటివ్స్ లో ఉన్నా పేర్లు పెట్టె పిలిచాను. షోలో బాగుండేది బావ అని పిలుస్తుంటే. అతను కూడా రియల్ మదరదళ్ళలాగా ఆట పట్టిస్తాడు షోలో. సుధీర్ టీవీ పర్సన్ కాదు. అతను హీరో పర్సనాలిటీ. అతని డ్యాన్స్, టాక్, ఎమోషన్స్.. అన్ని హీరోలానే ఉంటాయి. చాలా జోవియల్ గా ఉంటాడు. కానీ అదంతా స్టేజి మీదే. బయట చాలా రిజర్వ్డ్ పర్సన్. సుధీర్ స్టేజి మీద పులి, కానీ స్టేజి దిగాక అసలు సెట్ లో ఉన్నాడా అనిపిస్తుంది అని చెప్పింది.

Also Read : Mohan Babu : ఇది రాజకీయమా అని వదిలేసాను.. రాజకీయాలు నాకు సూట్ అవ్వవు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్..

దీంతో సుధీర్ ఫ్యాన్స్ అషురెడ్డి వ్యాఖ్యలు వైరల్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఇప్పుడు కమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా ఫేమ్, చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. మెజీషియన్ గా మ్యాజిక్ షోలు చేస్తూ కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ జబర్దస్త్ షోలో ఒక ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ టీమ్ లీడర్ గా ఎదిగి అనంతరం యాంకర్, సినిమాల్లో కమెడియన్ గా మారి బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో హీరోగా కూడా చేస్తున్నాడు.