×
Ad

Ashwini Sri : బిగ్‌బాస్‌లోకి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ గురించి తెలుసా? హాట్ ఫొటోలతో..

అశ్వినిశ్రీ.. మొదట సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు, రీల్స్ తో పేరు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది.

Ashwini Sri Social Media Star entry in Bigg Boss 7 with Wild Card

Ashwini Sri : బిగ్‌బాస్ సీజన్ 7(Bigg Boss 7) తెలుగు అయిదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం. అయితే ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శవాలి, యూట్యూబర్, నటి నయని పావని, సోషల్ మీడియా పర్సన్, ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న అశ్విని శ్రీ, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తిలను నాగార్జున వేదికపైకి పిలిచి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపించాడు.

వీరిలో అశ్వినిశ్రీ.. మొదట సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు, రీల్స్ తో పేరు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరి సినిమాలో రష్మిక ఫ్యామిలిలో ఒక అమ్మాయిగా నటించింది. బాలకృష్ణ సినిమాలో కూడా ఓ చిన్న రోల్ చేసింది. ఇలా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి బ్రేక్ కోసం చూస్తుంది.

Also Read : Bhole Shavali : బిగ్‌బాస్‌లోకి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన భోలే శవాలీ గురించి తెలుసా? ఒక్క పాటతో..

అశ్విని శ్రీ వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ చేసింది. ఆ తరవాత తనకి ఇష్టమైన నటన వైపు వచ్చింది. సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఫాలోవర్స్ పెంచుకున్న అశ్విని శ్రీ హౌస్ లో కూడా అందాలు ఆరబోస్తుందా లేక గేమ్ తో ప్రేక్షకులని ఇంప్రెస్ చేస్తుందా చూడాలి.