నారాయణమూర్తి బయోపిక్ ‘మూర్తి’

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి దంపతుల జీవితం ఆధారంగా అశ్వినీ అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో హిందీలో ఓ సినిమా రూపొందుతోంది..

  • Publish Date - October 16, 2019 / 11:01 AM IST

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి దంపతుల జీవితం ఆధారంగా అశ్వినీ అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో హిందీలో ఓ సినిమా రూపొందుతోంది..

బాలీవుడ్‌లో మరో బయోపిక్ తెరకెక్కనుంది.. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, దేశంలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించిన ప్రముఖుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి దంపతుల జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందుతోంది. అశ్వినీ అయ్యర్‌ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘మూర్తి’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు.

Read Also : డిసెంబర్ 20 నుండి ‘ప్రతిరోజూ పండగే’

భర్త, దర్శకుడు అయిన నితేశ్‌ తివారీ, మహవీర్‌ జైన్‌తో కలిసి అశ్వినీ అయ్యర్‌ తివారీ ఈ సినిమాను నిర్మించనున్నారు.  ఈ సందర్భంగా ‘‘నేను 21 ఏళ్లుగా పని చేస్తున్నా. నారాయణమూర్తి, సుధామూర్తిని కలిశాక… వారిలా జీవించాలనే కోరిక కలిగింది. నిజాయితీ, సమగ్రతతో కూడిన వారి జీవితమే నాకు పెద్ద స్ఫూర్తి. వారు నన్నెంతగానో నమ్మారు. కథను చెప్పారు.. వారి జీవితంలో జరిగిన పలు విషయాలను వివరించారు.. వారి అంచనాలను నేను చేరుకోవాలని ఆశిస్తున్నాను’’ అంటూ  సుధామూర్తితో కలిసి దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

‘నిల్‌ బట్టే సన్నాటా’, ‘బరేలీ కీ బర్ఫీ’, కంగనా రనౌత్ నటిస్తున్న ‘పంగా’ (వచ్చే ఏడాది జనవరి 24న విడుదల కానుంది) సినిమాల తర్వాత అశ్వినీ అయ్యర్‌ తివారీ తెరకెక్కిస్తున్న చిత్రమిది.. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు