Ask KTR : RGVకి KTR పంచ్

  • Publish Date - April 11, 2020 / 03:02 AM IST

తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌.. డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మకు అదిరిపోయే పంచ్‌ వేశారు. లాక్‌డౌన్‌లో లిక్కర్‌ డోర్‌ డెలివరీ చేయాలన్న ఆర్జీవీకి ఆయన కౌంటర్‌ ఇచ్చారు. మద్యంలేక జనం పిచ్చెక్కిపోతున్నారని.. జట్టు పీక్కుంటున్నారని.. అందుకే వెస్ట్‌ బెంగాల్‌లాగా డోల్‌ డెలివరీ చేయడంపై ఆలోచించాలని వర్మ కోరారు.. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్‌..

రాముగారూ.. హెయిర్‌ కట్‌ గురించే కదా మీరు అడిగేదంటూ చమత్కరించారు. ఈ సరదా సంభాషణ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఇక  నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకూ కేటీఆర్‌ బదులిచ్చారు. లాక్‌డౌన్‌ గురించి ఓ నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు.. లాక్‌డౌన్‌ కొన్ని వారాల పాటు పొడిగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. దీనిపై అందరితో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ప్రపంచమంతా అంగీకరిస్తే పదేళ్ల పాటు ఏడాదికోసారి లాక్‌డౌన్‌ విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో  కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. లాక్‌డౌన్ ద్వారా ప్రజల్లో స్వయం క్రమశిక్షణ ఏర్పడిందని దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆయన కోరారు. 

Also Read |  మేల్కొన్నారు : చైనాలో కుక్కల మాంసం విక్రయాలపై నిషేధం