Astrologer Venu Swamy
Venu Swamy: సినీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నేపథ్యంలో.. గతంలో జ్యోతిష్కుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పలు యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూల్లో వేణుస్వామి విజయ్ దేవరకొండ, రష్మిక గురించి మాట్లాడారు. “వాళ్ల గురించి ఆల్రెడీ మనకు తెలుసు కదా. గీత గోవిందం సినిమా నుంచే వాళ్లు తెలుసు. వాళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు. (Venu Swamy)
చేసుకుని విడిపోతారు. ఆల్రెడీ ఇది ఇప్పుడు చెప్పిన విషయం కాదు ఎప్పుడో చెప్పాను. నేను నేరుగా ఆమెకే చెప్పాను. వేరే వాళ్లకి ఎందుకు చెప్పడం. డైరెక్ట్ గా ఆమెకే చెప్పాను. ఆయనను చేసుకోకు విడిపోతావు అని చెప్పాను. ఆ విషయంలోనే కొద్దిగా నాకు, ఆమెకు పొరపొచ్చాలు వచ్చాయి. ఆమె నన్ను పక్కకు పెట్టింది. నాకేం అభ్యంతరం లేదు.
హీరోయిన్ అయితే ఆమె నాకు కాదు కదా హీరోయిన్. సమాజానికి ఆమె హీరోయిన్. నాకేమో ఆమె క్లయింట్ మాత్రమే. నేను ఒక క్లయింట్‌గానే చూస్తా. అతను సీఎం అయినా, మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా, రౌడీ షీటర్ అయినా, క్యాసినో కింగ్ అయినా నాకు క్లయింటే.
ఎవడైనా సరే నా దృష్టిలో క్లయింట్ మాత్రమే. నాకు వ్యక్తిగతమైన రిలేషన్ ఉండదు. వేణుస్వామి అంటే ఒక జ్యోతిష్కుడు, ఒక ఆస్ట్రాలజర్ అంతే. క్లయింట్‌ను రూపంలోనే వాళ్లను చూస్తా తప్ప అతని పొజిషన్ నేను చూడను” అని చెప్పారు.
అలాగే, లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నారు కాబట్టి వాళ్లు కూడా ఫ్యూచర్‌లో కలిసి ఉండే అవకాశాలు లేవని వేణుస్వామి మరో ఇంటర్వ్యూలో అన్నారు. జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకుని తాను మాట్లాడుతానని చెప్పారు. లావణ్య త్రిపాఠికి గురు దోషం ఉందని, వరుణ్ తేజ్ కు నాగదోషం ఉందని అన్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్ బాగోలేదని, అతడికి మ్యారేజ్ ప్రాబ్లం కూడా ఉంటుందని వేణుస్వామి చెప్పారు. సమంత, నాగచైతన్య గురించి కూడా తాను ముందుగానే చెప్పానని అన్నారు.