Radhe Shyam: ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. మార్చి 11న రాధే శ్యామ్ రిలీజ్ కానుండగా రెబల్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా యూనిట్ కూడా మరోసారి ప్రమోషన్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ మధ్యనే ఈ రాతలే వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఒక్కో అప్డేట్ తో హైప్ పెంచేస్తుంది.
Radhe Shyam: ప్రమోషన్ స్టంట్స్ షురూ చేసిన రాధేశ్యామ్.. ఫ్యాన్స్ హ్యాపీ!
సమ్మర్ సీజన్ లో మార్చి 11న వరల్డ్ వైడ్ గా 10వేల థియేటర్లకుపైగా రిలీజ్ కానున్న రాధేశ్యామ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కూల్ స్టార్ గా మారి నటించినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే దర్శకుడితో పాటు యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటుండగా.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో రాధేశ్యామ్ విడుదలయ్యే ప్రతి థియేటర్ వద్ద ఆస్ట్రాలజీ కౌంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది.
Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. ఈ ఐదు అంశాలు గమనించారా?
ఈ సినిమాలో జోతిష్యం, హస్తసాముద్రికం తదితర అంశాలకు సంబంధించి చాలా హనెస్ట్గా ఓ విషయాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజన్ అని దర్శకుడు రాధాకృష్ణ వెల్లడించగా.. పెద్ద పెద్ద వారికి పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్లో ప్రభాస్ నటించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేసి.. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తున్నట్లు తెలుస్తుంది.