Radhe Shyam: ప్రమోషన్ స్టంట్స్ షురూ చేసిన రాధేశ్యామ్.. ఫ్యాన్స్ హ్యాపీ!

లవ్లీ వీడియో సాంగ్ తో మరోసారి అట్రాక్ట్ చేశాడు రాధేశ్యామ్. సంక్రాంతికి సినిమాను ప్రకటించి ప్రమోషన్ హవా చూపించిన ప్రభాస్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్ తో మళ్లీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు.

Radhe Shyam: ప్రమోషన్ స్టంట్స్ షురూ చేసిన రాధేశ్యామ్.. ఫ్యాన్స్ హ్యాపీ!

Radhe Shyam

Radhe Shyam: లవ్లీ వీడియో సాంగ్ తో మరోసారి అట్రాక్ట్ చేశాడు రాధేశ్యామ్. సంక్రాంతికి సినిమాను ప్రకటించి ప్రమోషన్ హవా చూపించిన ప్రభాస్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్ తో మళ్లీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. మార్చ్ 11నే రిలీజ్.. ఎక్కువ టైమ్ లేదు.. అటు భీమ్లానాయక్ తర్వాత రాబోతున్న సినిమా.. అదీ పాన్ ఇండియా లెవెల్ లో.. అందుకే తగ్గేదే లే అంటూ బరిలోకి దూకబోతున్నాడు రాధేశ్యామ్.

Radhe Shyam: ప్రపంచంలోనే తొలి సినిమా ఇదే.. డైరెక్టర్ రాధాకృష్ణ

మరోసారి ప్రమోషన్ మెటీరియల్ తో సందడి చేస్తోంది రాధేశ్యామ్. సంక్రాంతి వాయిదా తర్వాత కాస్త సైలెంటయిన మేకర్స్.. ప్రమోషన్ హడావిడీని స్టార్ట్ చేశారు. వాలంటైన్స్ డేకు స్పెషల్ లవబుల్ టీజర్.. మొన్న అమితాబ్ వాయిస్ ఓవర్ అందించారనే అప్ డేట్.. రీసెంట్ గా ఈ రాతలే వీడియో వర్షన్ ఇలా కాస్త హెడ్ లైన్స్ లో నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు.

Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. ఈ ఐదు అంశాలు గమనించారా?

రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ వచ్చిన ఈ రాతలే సాంగ్ ను యానిమేషన్ రూపంలో తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్లెజెంట్ మూడ్ లో ప్రభాస్, పూజా హెగ్డేలను చూపిస్తూ మాయ చేశారు. ఈ పాటలో విక్రమాదిత్య, ప్రేరణలుగా ప్రభాస్, పూజా ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. రాధాకృష్ణ షూట్ చేసిన లోకేషన్స్ సైతం పాటలో హైలైట్ అవుతున్నాయి. ఇలా భారీ బడ్టెట్ తో ఇంత కలర్ ఫుల్ గా రూపొందిన రాధేశ్యామ్ కోసం ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ను పీక్స్ కు చేర్చారు.

Radhe Shyam: రాధేశ్యామ్‌కి ఓటీటీ ఆఫర్.. రూ.400 కోట్లకు పైగా డీల్!

మార్చ్ 11న పాన్ ఇండియాను టార్గెట్ చేయబోతుంది ప్రభాస్ రాధేశ్యామ్. రిలీజ్ కి పెద్దగా గ్యాప్ లేదు కాబట్టి.. కాస్త హైప్ పెంచడయ్యా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక యాక్టివ్ గా ఉండాల్సిన టైమ్ వచ్చిందనకున్న రాధేశ్యామ్ మేకర్స్ అలర్టయ్యారు. రీసెంట్ సాంగ్ తర్వాత మరో టీజర్ తో పాటూ రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మార్చ్ ఫస్ట్ వీక్ లో ఓ భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేసింది యూవీ క్రియేషన్స్.