Atlee : 18 ఏళ్ళ క్రితం ఐడియా.. అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాపై డైరెక్టర్ ట్వీట్..
తాజాగా దర్శకుడు అట్లీ ఈ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసారు. (Atlee)
- Saketh U
- Published On : April 8, 2026 / 12:53 PM IST
Atlee
Atlee : అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఈ సినిమా టైటిల్ రాకా అని ప్రకటించారు. రాకా టైటిల్ ప్రకటిస్తూ అల్లు అర్జున్ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో టైటిల్, పోస్టర్ వైరల్ గా మారాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా దర్శకుడు అట్లీ ఈ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసారు. అట్లీ తన ట్వీట్ లో.. రాకా కేవలం సినిమా మాత్రమే కాదు. చాలా ఏళ్లుగా నేను దీన్ని మోస్తున్నాను. గత 18 ఏళ్లుగా నేను ఈ ఐడియాని పట్టుకొని ఉన్నాను. ఇది ఎప్పుడూ ఫేడ్ అవుట్ అవ్వదు. ఇది నన్ను టెస్ట్ చేసింది, షేప్ చేసింది, ప్రతి విషయంలో నాతో ఉంది ఈ ఆలోచన. నిజాయితీగా ఇది ఒక ఆరంభం మాత్రమే అని పోస్ట్ చేసాడు.
Also Read : Allu Arjun AA22: అల్లు అర్జున్ అట్లీ సినిమా టైటిల్ వచ్చేసింది.. బన్నీ బర్త్ డే ఫ్యాన్స్ కి ట్రీట్..
దీంతో ఇది 18 ఏళ్ళ క్రితం అట్లీ ఆలోచనల్లో వచ్చిన ఐడియా అని తెలుస్తుంది. 18 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ ఐడియా ఇప్పుడు ఎలా తెరకెక్కిస్తాడో అనో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
#Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.
It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs
— atlee (@Atlee_dir) April 8, 2026
