అక్షయ్, ధనుష్, సారాల ‘అత్రంగి రే’
అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్‌లు ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘అత్రంగి రే’..

అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్‌లు ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘అత్రంగి రే’..
బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్, సౌత్ ఇండియన్ స్టార్ ధనుష్, స్టార్ కిడ్ సారా అలీఖాన్‌లు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘తను వెడ్స్ మను’, ‘రాన్‌జానా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు.
ఈ సినిమాకు ‘అత్రంగి రే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టి సిరీస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతమందించనున్నారు.
‘అత్రంగి రే’ సినిమా నుండి కొన్ని స్టిల్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది మూవీ టీమ్. లవ్ స్టోరిగా రూపొందబోయే ఈ చిత్రాన్ని 2021 లవర్స్ డే కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు : ఆనంద్ ఎల్ రాయ్, భూషణ్ కుమార్.