Kapil Sharma : స్టార్ కమెడియన్ కాఫీ షాప్ పై మళ్ళీ దాడి.. మళ్ళీ వాళ్ళే.. దారికి రాకపోతే అంటూ బెదిరింపులు..
బాలీవుడ్ స్టార్ కమెడియన్, టెలివిజన్ హోస్ట్ కపిల్ శర్మకు చెందిన కెనడా లోని క్యాప్స్ కేఫ్ వద్ద మరోసారి కాల్పులు జరిగాయి. (Kapil Sharma)
- Saketh U
- Published on- May 4, 2026 / 07:25 AM IST
Kapil Sharma
Kapil Sharma : బాలీవుడ్ స్టార్ కమెడియన్, టెలివిజన్ హోస్ట్ కపిల్ శర్మకు చెందిన కెనడా లోని క్యాప్స్ కేఫ్ వద్ద మరోసారి కాల్పులు జరిగాయి. ఇటీవల బాలీవుడ్ ని రెగ్యులర్ గా భయపెడుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో కపిల్ శర్మ క్యాప్స్ కేఫ్ పై మూడు సార్లు దాడి చేసింది అని ఆరోపణలు ఉన్నాయి. ఓపెనింగ్ జరిగిన రోజే కేఫ్ పై గన్స్ తో కాల్పులు చేసి అల్లకల్లోలం సృష్టించారు. ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా కెనడాలోని కపిల్ శర్మ కేఫ్ పై దాడిచేశారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ స్టార్స్ ని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ కూడా మేమే బెదిరిస్తున్నాము అంటూ పలుమార్లు లీకులు ఇచ్చింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో సహా చాలా మంది బాలీవుడ్ నటీనటులు, దర్శకులను ఈ గ్యాంగ్ భయపెట్టింది. కపిల్ శర్మని కూడా గత కొన్నేళ్లుగా భయపెడుతుంది. అయితే కపిల్ శర్మ ఈ దాడులపై గతంలో పోలీసులకు కంప్లైంట్ చేసాడు కానీ స్పందించలేదు.
Also Read : Varanasi : వారణాసి సినిమాకు షాక్ ఇచ్చిన అధికారులు.. నిజమేనా? వెరీ గుడ్ అంటున్న నెటిజన్లు..
తాజాగా మరోసారి కెనడాలోని క్యాప్స్ కేఫ్ బయట, పక్కనే ఉన్న మరో షాప్ లో కాల్పులు జరిపి ఇప్పటికి దారికి రాకపోతే మా నెక్స్ట్ టార్గెట్ ముంబైలోని కపిల్ శర్మ నివాసమే అంటూ ఓ సోషల్ మీడియా ఖాతా ద్వారా లారెన్స్ గ్యాంగ్ హెచ్చరికలు జారీ చేసిందని సమాచారం.
