Varanasi : వారణాసి సినిమాకు షాక్ ఇచ్చిన అధికారులు.. నిజమేనా? వెరీ గుడ్ అంటున్న నెటిజన్లు..
వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న ఈ సినిమాని పాన్ వరల్డ్ రిలీజ్ చేయబోతున్నారు. (Varanasi)
Varanasi
Varanasi : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు – ప్రియాంక చోప్రా జంటగా వారణాసి సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ తోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న ఈ సినిమాని పాన్ వరల్డ్ రిలీజ్ చేయబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. మహేష్ బాబు సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకోడానికి జర్మనీ వెళ్లారు. తిరిగొచ్చాక మే 18 నుంచి హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఒక షెడ్యూల్ ప్లాన్ చేద్దామనుకున్నారు.
Also See : Divi : ఆరెంజ్ ఆర్మీ.. SRHకి సపోర్ట్ చేస్తూ.. స్టేడియంలో సందడి చేసిన నటి దివి.. ఫొటోలు..
నెక్స్ట్ షెడ్యూల్ లో అండర్ వాటర్ సీక్వెన్స్ ప్లాన్ చేసారు మూవీ టీమ్. అయితే ఇందుకోసం దాదాపు 150 ట్యాంకర్ల నీళ్లు కావాలి. ఇందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ బోర్డుని మూవీ టీమ్ రిక్వెస్ట్ చేసిందని టాలీవుడ్ సమాచారం. అందుకు అయ్యే ఖర్చు కూడా భరిస్తాము అని తెలిపింది. అయితే ప్రస్తుతం సమ్మర్. సమ్మర్ లో హైదరాబాద్ లో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది.
దీంతో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాకు ప్రజలే ముఖ్యం, అత్యవసరాలకే ముందు వాటర్ సప్లై చేస్తాము, సినిమా షూటింగ్ లాంటి అత్యవసరం కాని వాటికీ ఈ సమయంలో వాటర్ సప్లై చేయలేము. సమ్మర్ అయ్యేవరకు నీళ్లను సప్లై చేయలేము అని హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు వారాణసి మూవీ టీమ్ కి తెలిపారట. దీంతో హైదరాబాద్ వాటర్ బోర్డు ఇలాంటి సమయంలో ప్రజల గురించి ఆలోచించి మంచి పని చేసిందని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Also Read : Producers : స్టార్ హీరోలపై యుద్ధం చేస్తున్న తమిళ నిర్మాతలు.. టాలీవుడ్ నిర్మాతలకు ఆ ధైర్యం ఉందా?
వాటర్ బోర్డు నో చెప్పడంతో వారణాసి మూవీ టీమ్ ఆలోచనలో పడింది. ఇప్పుడు వాటర్ దొరక్కపోతే ప్లాన్ చేసిన షూటింగ్ ఆగిపోనుంది. ఈ షెడ్యూల్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి రాజమౌళి వేరే సీన్స్ ఏదైనా ప్లాన్ చేసుకుంటాడా? లేకపోతే వాటర్ ఎక్కడ్నుంచి అయినా తెప్పిస్తారా? షూటింగ్ వాయిదా వేసుకుంటారా చూడాలి మరి.
