Saif Ali Khan Incident Updates
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దాడి ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దాడికి పాల్పడింది ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలిసిన వాళ్లే ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సైఫ్ కుమారుడి రూమ్‌లోకి వెళ్లేందుకు ఆగంతకుడి యత్నిస్తుండగా సైఫ్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగంతకుడికి సైఫ్‌కి మధ్య పెనుగులాట జరిగింది. సైఫ్ పై దాడి అనంతరం నిందితుడు పారిపోయాడు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సైఫ్ ఇంటి సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. సైఫ్ పై దుండగుడు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కత్తిలో దాడి చేశాడు. కాగా.. అంతకముందు రెండు గంటల లోపల ఎవరూ ఆ సొసైటీలోకి వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. దీంతో సొసైటీలో ఆ దుండగుడు ముందే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలీఖాన్ సొసైటీలోని సిబ్బందిలోనే దుండగుడు ఉండొచ్చునని భావిస్తున్నారు. ఇక సొసైటీ గార్డు సైతం ఎవ్వరిని చూడలేదని చెబుతుండడం కూడా ఈ అనుమానాలకు మరింత ఊతం ఇస్తోంది. ఇప్పటికే సైఫ్‌కు చెందిన ఐదుగురు సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
కాగా.. ఘటన జరిగిన సమయంలో కరీనాతో పాటు తైమూర్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. సైఫ్‌కు ఆరు చోట్ల కత్తి గాయాలు అయ్యాయి. వీటిలో మెడ, వెన్నుముక పక్కన బలమైన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఓ సైఫ్ కు ఓ శస్త్రచికిత్స పూర్తి అయింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో సైఫ్ అలీఖాన్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు కూడా సైఫ్ అలీఖాన్ సుపరిచితుడే. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీలో భైరవ పాత్రలో సైఫ్ కనిపించారు. అంతకంటే ముందు ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడి పాత్రలో యాక్ట్ చేశారు.
సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిందని తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.