Daaku Maharaaj Collections : వంద కోట్ల క్లబ్‌లో బాలయ్య మూవీ.. 4 రోజుల్లో ‘డాకు మహారాజ్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మూవీ డాకు మహారాజ్.

Balakrishna Daaku Maharaaj four days Collections here
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులకు కావాల్సిన యాక్షన్‌తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉండడంతో తొలి ఆట నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. సరికొత్త అవతారంలో బాలయ్య కనిపించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ హవా నడుస్తోంది.
నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది. దీంతో బాలయ్య అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. తొలి రోజే ఈ చిత్రం రూ.56 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డాకు మహారాజ్ సినిమా హిట్ అవ్వాలంటే రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్లపైగా కలెక్షన్లు సాధించింది. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రంతో వరుసగా నాలుగో హిట్‌ను అందుకోనున్నారు బాలయ్య.
RC 16 : రామ్‌చరణ్ ఆర్‌సీ16 కోసం జగపతిబాబు పడుతున్న కష్టం చూశారా ?
ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లు కథానాయికలుగా నటించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా, సచిన్ ఖేద్కర్, చాందిని చౌదరిలు కీలక పాత్రలను పోషించారు.
KING OF SANKRANTHI #DaakuMaharaaj has turned into a CELEBRATION with the audience’s love ❤️#BlockbusterHuntingDaakuMaharaaj crosses 𝟏𝟎𝟓 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟒 𝐝𝐚𝐲𝐬 sweeping all territories into his zone 🪓🔥
𝐓𝐇𝐄 𝐇𝐔𝐍𝐓 𝐈𝐒 𝐎𝐍 ~ Book… pic.twitter.com/JPF8US64bO
— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025