RC 16 : రామ్‌చ‌ర‌ణ్ ఆర్‌సీ16 కోసం జ‌గ‌ప‌తిబాబు ప‌డుతున్న క‌ష్టం చూశారా ?

'ఉప్పెన' ఫేమ్​ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌ చరణ్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు.

RC 16 : రామ్‌చ‌ర‌ణ్ ఆర్‌సీ16 కోసం జ‌గ‌ప‌తిబాబు ప‌డుతున్న క‌ష్టం చూశారా ?

RC 16 update Jagapathi Babu make up video post in social media viral

Updated On : January 16, 2025 / 11:04 AM IST

‘ఉప్పెన’ ఫేమ్​ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌ చరణ్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో ఇది 16వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ RC16 వర్కింగ్ టైటిల్​తో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వ‌స్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ మూవీలో జాన్వీక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. జ‌గ‌ప‌తి బాబు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

ఈ చిత్రంలో త‌న పాత్ర మేకోవ‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని గ‌తంలో జ‌గ‌ప‌తి బాబు చెప్పారు. తాజాగా త‌న పాత్ర కోసం మేక‌ప్ వేసుకుంటున్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా కాలం త‌రువాత బుచ్చిబాబు ఆర్‌సీ 16 కోసం మంచి ప‌ని పెట్టాడు. గెట‌ప్ చూసిన త‌రువాత నాకు చాలా తృప్తిగా అనిపించింద‌ని రాసుకొచ్చారు.

Junior NTR : సైఫ్ అలీఖాన్ పై దాడి.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తి అయింది.

ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజే ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల‌ను వ‌సూలు చేసింది.

Pushpa 2 Reloaded Version : భారీగా తగ్గించిన పుష్ప 2 టికెట్ రేటు.. రీ లోడెడ్ వర్షన్.. స్పెషల్ ఆఫర్ ఏ రోజో తెలుసా?