Pushpa 2 Reloaded Version : భారీగా తగ్గించిన పుష్ప 2 టికెట్ రేటు.. రీ లోడెడ్ వర్షన్.. స్పెషల్ ఆఫర్ ఏ రోజో తెలుసా?

పుష్ప 2 సినిమాని రీ లోడెడ్ వర్షన్ అంటూ మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

Pushpa 2 Reloaded Version : భారీగా తగ్గించిన పుష్ప 2 టికెట్ రేటు.. రీ లోడెడ్ వర్షన్.. స్పెషల్ ఆఫర్ ఏ రోజో తెలుసా?

Pushpa 2 Reloaded Version Special Ticket Price in North and Nizam

Updated On : January 15, 2025 / 9:39 PM IST

Pushpa 2 Reloaded Version : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజయి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజయి నెల రోజులు దాటగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాలు రావడంతో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది కానీ నార్త్ లో మాత్రం ఇంకా ఆడుతుంది. ఈ సినిమాకు నార్త్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. నార్త్ లో పుష్ప 2కి ఫుల్ క్రేజ్, బన్నీకి ఫ్యాన్స్ వచ్చి థియేటర్స్ అన్ని నిండిపోయాయి.

పుష్ప 2 సినిమా ఇప్పటివరకు 1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డు కూడా బద్దలు కొట్టింది. అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాగా అమీర్ ఖాన్ దంగల్ 2000 కోట్లతో ఉండగా ఆ రికార్డ్ కూడా బద్దలు కొట్టాలనే ప్లాన్ తో ఉంది పుష్ప 2 మూవీ యూనిట్. దీంతో ఈ సినిమాకు మరో 20 నిమిషాల సీన్స్ జత చేసి జనవరి 17న మళ్ళీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Also Read : Prabhas : రెండేళ్లలో ప్రభాస్ నాలుగు సినిమాలు రిలీజ్.. నిజంగానే రిలీజ్ చేస్తాడా?

దీంతో పుష్ప 2 సినిమాని రీ లోడెడ్ వర్షన్ అంటూ మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక్కడ సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి దొరికిన థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నార్త్ లో మాత్రం రిలీజ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్ జనవరి 17న రిలీజ్ చేస్తుండగా ఆ రోజు సినిమా లవర్స్ డే అంటూ టికెట్ రేట్లు భారీగా తగ్గించి స్పెషల్ ఆఫర్ పెట్టారు.

Pushpa 2 Reloaded Version Special Ticket Price in North and Nizam

నార్త్ లో పుష్ప 2 సినిమా జనవరి 17న కేవలం 112 రూపాయలు మాత్రమే అని అనౌన్స్ చేసారు. అలాగే నైజాంలో సింగిల్ స్క్రీన్స్ లో 112 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు అని ప్రకటించారు. కేవలం నార్త్, నైజాంలో మాత్రమే ఈ ఆఫర్ అని తెలుస్తుంది. ఏపీలో, సౌత్ లో ఈ ఆఫర్ ఉంటుందో, ఉండదో ఇంకా ప్రకటించలేదు. మొన్నటిదాకా 300 నుంచి 500 వరకు ఉన్న టికెట్ భారీగా తగ్గింది. ఆ ఒక్క రోజు 112 రూపాయలు పెట్టడంతో ఆ రోజు నార్త్ నుంచి భారీ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు మూవీ యూనిట్.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ.. పర్ఫెక్ట్ పండగ సినిమా అంటూ..

ఈ రీ లోడెడ్ వర్షన్ రిలీజ్ తో పుష్ప 2 సినిమా 2000 కోట్ల గ్రాస్ పైన వసూలు చేసి దంగల్ రికార్డ్ కూడా బద్దలుకొట్టి అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డ్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఆ ఒక్క రికార్డ్ కూడా బద్దలు కొట్టేస్తే గతంలో నాన్ బాహుబలి రికార్డ్స్ అని రాసినట్టు ఇకపై నాన్ పుష్ప 2 రికార్డ్స్ అని రాసుకుంటారు బాలీవుడ్ తో సహా.