Junior NTR : సైఫ్ అలీఖాన్ పై దాడి.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి పై సోష‌ల్ మీడియా వేదిక‌గా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు

Junior NTR : సైఫ్ అలీఖాన్ పై దాడి.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR reacts to Saif Ali Khan's attack

Updated On : January 16, 2025 / 9:57 AM IST

సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి పై సోష‌ల్ మీడియా వేదిక‌గా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. దాడి గురించి తెలిసి షాకైన‌ట్లు చెప్పారు. సైఫ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

‘సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.’ అంటూ ఎక్స్‌లో ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

Saif Ali Khan : బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ పై క‌త్తితో దుండ‌గుడి దాడి.. ఆరు చోట్ల గాయాలు..!

ముంబైలోని బాంద్రాలోని నివాసంలో సైఫ్ అలీఖాన్ పై దాడి జ‌రిగింది. గురువారం తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల స‌మ‌యంలో త‌న కుటుంబంతో క‌లిసి సైఫ్ నిద్ర‌లో ఉండ‌గా ఓ దొంగ వారి ఇంట్లోకి చొర‌బ‌డ్డాడు. అలికిడికి సైఫ్ మేల్కొన్నాడు. దొంగ‌ను ప‌ట్టుకునేందుకు సైఫ్ య‌త్నించ‌గా.. దుండ‌గుడు క‌త్తితో దాడి చేసి అక్క‌డ నుంచి ప‌రారు అయ్యారు. గాయ‌ప‌డిన సైఫ్‌ను వెంట‌నే కుటుంబ స‌భ్యులు ముంబైలోని లీలావ‌తి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రికిలో సైఫ్‌కు చికిత్స అందిస్తున్నారు.

కాగా.. సైఫ్ అలీఖాన్, ఎన్టీఆర్ లు క‌లిసి దేవ‌ర మూవీలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా న‌టించ‌గా సైఫ్ విల‌న్‌గా క‌నిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తాన‌ని కొర‌టాల.. దేవ‌ర విడుద‌ల కు ముందే చెప్పారు. రెండో భాగం కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas : రెండేళ్లలో ప్రభాస్ నాలుగు సినిమాలు రిలీజ్.. నిజంగానే రిలీజ్ చేస్తాడా?

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం బాలీవుడ్ మూవీ వార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త‌రువాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ మూవీలో న‌టించ‌నున్నారు.