Saif Ali Khan : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దుండగుడి దాడి.. ఆరు చోట్ల గాయాలు..!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది.

Bollywood actor Saif Ali Khan injured after intruder barges in his bandra house
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నటుడు గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు.
గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముంబై బాంద్రాలోని నివాసంలో సైఫ్ అలీఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్నాడు. ఓ దొంగ వారి ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగతనానికి యత్నించాడు. అలికిడి కావడంతో సైఫ్ మేల్కొన్నాడు. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగ సైఫ్ పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారు అయ్యాడు.
వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. దాడిలో నటుడికి ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సైఫ్ నివాసానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో సైఫ్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్, పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Mahesh Babu : మహేష్ బాబు ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ.. పర్ఫెక్ట్ పండగ సినిమా అంటూ..
బాలీవుడ్ టాప్ హీరోల్లో సైఫ్ ఒకరు. ఆయన ఎన్నో సూపర్ హిట్ మూవీల్లో నటించారు. హీరోగానో కాకుండా విలన్‌గా పలు బాషల్లో నటించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా కనిపించారు. ఇక గతేడాది ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో విలన్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువ అయ్యాయి.
కాగా.. ఆయన దుండగుడి దాడిలో గాయపడ్డారని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.