×
Ad

8 నుంచి ఆవకాయ-అమరావతి ఫెస్టివల్.. త్వరలోనే సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం భేటీ.. ఉగాదికి నంది అవార్డ్స్‌

"నంది నాటకోత్సవ అవార్డులు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము" అని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.

Kandula Durgesh

Kandula Durgesh: త్వరలో తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మొదట హోం శాఖ నేతృత్వంలో ఉన్నతాధికారుల సమావేశం ఉంటుందని కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తెలిపారు. తర్వాత సినిమాటోగ్రఫీ సమావేశం నిర్వహిస్తుందని అన్నారు. సినిమా టికెట్ రేట్లపై ప్రధానంగా చర్చ జరుపుతామని తెలిపారు.

ఏపీలో షూటింగ్ నిర్వహించే సినిమాలకు సంబంధించి టికెట్ రేట్ల పెంపు, అదే విధంగా హై బడ్జెట్ సినిమాలకు రేట్ల పెంపుపై చర్చ ఉంటుందని అన్నారు. ఈ సమావేశం తర్వాత సినీ పరిశ్రమ ప్రముఖులతో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, అధికారులు కీలక సమావేశం నిర్వహిస్తారు..

“పప్పు నెయ్యి , ఆవకాయ, మనకు ఎంతో ఇష్టం. ఆంధ్రుల అభిమాన వంటకం ఆవకాయ. మన ఆంధ్రప్రదేశ్ లో కళా సంస్కృతి ఎక్కువ. కళలకు ఏ మాత్రం నోచుకోని పరిస్థితి నుంచి మళ్లీ ముందుకు వస్తున్నాం.

ఆవకాయ- అమరావతి పేరుతో టీం వర్క్ కన్సల్టెంట్స్ తో కలిసి ఫెస్టివల్ నిర్వహిస్తోంది. పున్నమి ఘాట్ లో ఫెస్టివల్ జరుగుతుంది. సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. పద్యం, పద్య నాటకం, ఇవన్నీ ఈ ఫెస్టివల్ లో ఉంటాయి. కూచిపూడి నృత్యం, గానం, నృత్యం, సంగీతం, నాటకం, కవిత్వం… ఇలా అన్ని సాహితీ ప్రక్రియలు ఫెస్టివల్ లో ఉంటాయి.

నంది అవార్డ్స్ తో పాటు, నంది నాటకోత్సవానికి సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వచ్చే ఏడాది ఉగాదికి నంది అవార్డ్స్‌తో పాటు నంది నాటకోత్సవ అవార్డులు ఇవ్వాలని అనుకుంటున్నాము” అని తెలిపారు.

Also Read: Video: మొట్టమొదటిసారి భారతీయ స్నాక్స్ రుచి చూసిన అమెరికా అమ్మాయి.. ఆమె స్పందన కెవ్వుకేక

కేసీఆర్‌ కామెంట్స్‌పై స్పందన
కేసీఆర్ విమర్శలు చేయడం కోసం ఏవేవో మాట్లాడుతున్నారని కందుల దుర్గేశ్ అన్నారు.” కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు ఎంఓయూలు గ్రౌండ్ అవ్వని పరిస్థితి వచ్చిందేమో. కేసీఆర్ హయాంలో అక్కడ గ్రౌండ్ అవ్వలేదేమో. ఏపీలో జరిగిన ప్రతి ఎంఓయూ గ్రౌండ్ అవుతున్నాయి. కేసీఆర్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి” అని తెలిపారు.

పవన్ కల్యాణ్ త్యాగం వల్లే..
పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని కందుల దుర్గేశ్ అన్నారు. “గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్. కూటమి గెలుపు, రాష్ట్ర శ్రేయస్సు కోసం తనను తాను తగ్గించుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్.
ప్రజల కోసమే 21 సీట్లకి తగ్గారు. ఆయనే చొరవ తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం వచ్చేది కాదు. జనసేన పార్టీకి పదవులు వచ్చేవి కావు.
ఇక్కడ మనందరికీ రాజముద్ర వచ్చింది అంటే ఏకైక కారణం పవన్” అని చెప్పారు.

ఆవకాయ- అమరావతి ఫెస్టివల్‌కు ప్రవేశం ఉచితం

ఆవకాయ – అమరావతి ఫెస్టివల్‌పై అధికారులు మరిన్ని వివరాలు తెలిపారు. టూరిజం ఎండీ ఆమ్రపాలి మాట్లాడుతూ.. “త్వరలో ఆవకాయ – అమరావతి ఫెస్టివల్ ప్రారంభిస్తున్నాం. సినిమా, కల్చర్, టూరిజంలో ఫెస్టివల్ ప్రారంభం అవుతుంది. జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ఆవకాయ అమరావతి ఫెస్టివల్.

టూరిజం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ.. టూరిజం ప్రమోషన్ కోసం ఆవకాయ అమరావతి- ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. త్వరలో ఆవకాయ-అమరావతి బ్రాండ్ అవుతుంది. టీం వర్క్ కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో ఫెస్టివల్ జరుగుతుంది..

విజయవాడ పున్నమి ఘాట్ లో ఈ ఫెస్టివల్ మూడు రోజులు జరుగుతుంది. టూరిజం పై వర్క్ షాప్స్ ఉంటాయి. ఇకపై ప్రతి ఏడాది ఆవకాయ- అమరావతి ఉత్సవాలు జరుగుతాయి. కల్చర్, లిటరేచర్ లో అనేక అంశాలు ఈ ఫెస్టివల్ లో ఉంటాయి. జనవరి 8 నుంచి 10 వరకు పున్నమి ఘాట్ లో జరిగే ఆవకాయ- అమరావతి ఫెస్టివల్‌కు ప్రవేశం ఉచితం” అని తెలిపారు.