Avatar 2 : రిలీజ్ కి ముందే కోట్లు కలెక్ట్ చేస్తున్న అవతార్ 2

అవతార్ సినిమాని మొదటి రోజే చూడటానికి ఇండియాలో దాదాపు 2 లక్షల మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో అవతార్ 2 సినిమా మొదటి రోజుకి ప్రీ బిజినెస్ దాదాపు 7 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇక వీకెండ్స్ లో అయితే దాదాపు.....................

Avatar 2 creates new records in pre bookings

Avatar 2 :  13 ఏళ్ళ క్రితం వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అప్పటి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసి భారీ విజయం సాధించింది. అప్పట్లోనే అద్భుతమైన విజువల్స్ తో పండోరా అనే గ్రహాన్ని, కొత్త భాషని సృష్టించి దర్శకుడు జేమ్స్ కామెరూన్ అందర్నీ మాయ చేశాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకి పార్ట్ 2 రాబోతుంది. అవతార్:ది వే ఆఫ్ వాటర్ అనే పేరుతో ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అవతార్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2డీ, 3డీ, 4డీఎక్స్ 3డీ, ఐమ్యాక్స్3డీ ఫార్మట్లలో అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మన దేశంలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండగా ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయి అయిపోయాయి కూడా. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా సినీ ప్రేమికులు సినిమాని చూడటానికి టికెట్స్ బుక్ చేస్తున్నారు.

Joker 2 : జోకర్ 2 షురూ.. 2024కి థియేటర్స్ లో..

అవతార్ సినిమాని మొదటి రోజే చూడటానికి ఇండియాలో దాదాపు 2 లక్షల మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో అవతార్ 2 సినిమా మొదటి రోజుకి ప్రీ బిజినెస్ దాదాపు 7 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇక వీకెండ్స్ లో అయితే దాదాపు 5 లక్షల టికెట్లు ఇప్పటికే అమ్ముడు పోయి 16 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఇలా రిలీజ్ కి ముందే అవతార్ 2 కోట్లు కురిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా రిలీజ్ వరకు ప్రీ బుకింగ్స్ తోనే దాదాపు 40 కోట్ల బిజినెస్ జరగొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అమ్ముడుపోయిన టికెట్స్‌లో ఎక్కువగా పీవీఆర్‌, ఐనాక్స్, సినీపోలిస్‌ మల్టీప్లెక్స్ లలోనే బుక్ చేసుకోవడం విశేషం. ప్రీ బుకింగ్స్ కే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయంటే ఇక రిలీజ్ అయ్యాక ఊహించని కలెక్షన్స్ రావడం ఖాయం.