Avatar 2: గ్లోబల్ స్థాయిలో రిలీజ్‌తోనే చరిత్ర సృష్టిస్తున్న అవతార్-2

ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తున్న ఈ గ్రాండ్ విజువల్ వండర్ మూవీని డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను రికార్డు స్థాయి భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాను ఆయా దేశాల ప్రేక్షకులను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు.

Avatar 2: గ్లోబల్ స్థాయిలో రిలీజ్‌తోనే చరిత్ర సృష్టిస్తున్న అవతార్-2

Avatar 2 Global Release Already Creates History

Updated On : December 14, 2022 / 2:56 PM IST

Avatar 2: ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తున్న ఈ గ్రాండ్ విజువల్ వండర్ మూవీని డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను రికార్డు స్థాయి భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాను ఆయా దేశాల ప్రేక్షకులను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు.

Avatar 2 : రిలీజ్ కి ముందే కోట్లు కలెక్ట్ చేస్తున్న అవతార్ 2

మరో రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అవతార్-2 మేనియాతో ప్రేక్షకులు ఊగిపోనున్నారు. ఈ క్రమంలో అవతార్-2కి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయనే విషయంపై సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 52 వేల స్క్రీన్స్‌లలో రిలీజ్‌ను కన్ఫం చేసుకుంది. గతంలో వచ్చిన అవెంజర్స్ ది ఎండ్ గేమ్ మూవీని ఇది అధిగమించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Avatar 2: అవతార్-2 సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?

ఈ లెక్కన అవతార్-2 తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఇండియాలోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేస్తుండగా, తెలుగు వెర్షన్‌కు ప్రముఖ టాలీవుడ్ ఆర్టిస్టులు పనిచేయడంతో ఈ సినిమాను తెలుగులోనూ చూసేందుకు జనం ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి డిసెంబర్ 16 నాటికి అవతార్-2 ప్రపంచవ్యాప్తంగా ఎన్ని స్క్రీన్స్‌లలో రిలీజ్ అవుతుందనే విషయంపై క్లారిటీ వస్తే.. వసూళ్ల విషయంలోనూ క్లారిటీ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.