Avatar
Avatar : హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అవతార్ కి సీక్వెల్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో పార్ట్ అవతార్: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. అయితే ఆ సినిమా రిలీజ్ కి ముందు మరోసారి అవతార్ పార్ట్ 2 – ది వే ఆఫ్ వాటర్ ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కంటిన్యుటీగానే పార్ట్ 3 ఉండనుంది.(Avatar)
అయితే అవతార్ ది వే ఆఫ్ వాటర్ రీ రిలీజ్ లో అవతార్ మూడవ పార్ట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ చూపిస్తారంట. అలాగే జేమ్స్ కామెరాన్ ఓ స్పెషల్ మెసేజ్ ఈ రీ రిలీజ్ తో ఇవ్వనున్నాడట. అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా నిన్న అక్టోబర్ 2 నుంచి రీ రిలీజ్ అయింది. ఇండియాలో కూడా పలు చోట్ల ఈ సినిమా రీ రిలీజ్ అయింది.
Also See : Kiran Abbavaram : ఫ్రెండ్ పెళ్ళిలో భార్య, కొడుకుతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం.. క్యూట్ ఫొటోలు వైరల్..
అలాగే డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ మెసేజ్ తో పాటు అవతార్ పార్ట్ 3 కి సంబంధించి కొన్ని బిహైండ్-ది-సీన్స్ ని కూడా అవతార్ ది వే ఆఫ్ వాటర్ రీ రిలీజ్ తో చూపించనున్నారట. దీంతో అవతార్ ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్ కి కూడా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక పార్ట్ 3 అవతార్ – ఫైర్ అండ్ యాష్ ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ దాకా ఆగాల్సిందే.
Also See : Rahul Sipligunj : ఫ్యామిలీతో రాహుల్ సిప్లిగంజ్ దసరా వేడుకలు.. ఫొటోలు..