తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు.. భారతీయ సినిమా ఇండస్ట్రీకే 2019 సంవత్సరం పెద్దగా కలిసి రాలేదు. గతేడాది వసూళ్లు పరంగా సినిమాలు పెద్ద పెద్ద మార్క్‌లను సాధించలేకపోయాయి. 2019లో బాక్సాఫీస్ లెక్కలు ప్రకారం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇండియాలో అవెంజర్స్ అట.
అంటే ఇండియాలో ఒక హాలీవుడ్ మూవీ భారీ వసూళ్లను సాధించింది. అంతకుముందు ఏళ్లలో బాహుబిలి, దంగల్ వంటి సినిమాలతో కలకలలాడిన బాక్సాఫీస్.. 2019లో మాత్రం చప్పగా ముగిసింది. అందులోనూ ఓ హాలీవుడ్ సినిమా టాప్‌లో నిలవడం విశేషం.. అవెంజర్స్ ది ఎండ్ గేమ్ 2019కి గాను ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మార్వెల్స్ సూపర్ హీరోస్ తో తెరకెక్కిన ఈ చిత్రం 375కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసి దేశీయ చిత్రాలకు షాక్ ఇచ్చింది.
హిందీ, తెలుగు, తమిళంతో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషలలో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా విశేష ఆదరణ దక్కించుకుంది. అవెంజర్స్ సినిమా తరువాత హ్రితిక్ నటించిన వార్ మూవీ దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన ఈ మల్టీ స్టారర్ బిగ్గెట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.