Avika Gor : ఇండియా, వియత్నాం ప్రైమ్ మినిస్టర్స్‌తో అవికా గోర్.. గర్వంగా ఉంది అంటూ స్పెషల్ పోస్ట్..
తాజాగా అవికా గోర్ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
- Saketh U
- Published On : August 3, 2024 / 09:30 PM IST
Avika Gor Meets PM Narendra Modi Vietnam PM H.E. Mr. Pham Minh Chinh Photo goes Viral
Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో చిన్నప్పటి నుంచే ప్రేక్షకులని మెప్పించిన అవికా గోర్ ఆ తర్వాత హీరోయిన్ గా కూడా వరుస సినిమాలు చేస్తుంది. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ ఆ తర్వాత తెలుగు, కన్నడ, హిందీలో హీరోయిన్ గా సినిమాలు, సిరీస్ లు వరుసగా చేస్తుంది. అయితే తాజాగా అవికా గోర్ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
ఇటీవల వియత్నాం ప్రైమ్ మినిష్టర్ ఇండియాకు రావడంతో మన పీఎం నరేంద్రమోడీ దేశంలోని పలు విభాగాల నుంచి 52 మంది స్పెషల్ గెస్ట్ లని పిలిచారు. వియత్నాం ప్రైమ్ మినిష్టర్, మన పీఎంతో కలిసి ఏర్పాటు చేసిన లంచ్ ప్రోగ్రాంకి ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి కేవలం అవికా గోర్ ఒక్క దానికే ఆహ్వానం రావడం గమనార్హం.
Also Read : Director Apsar : శివుడి తత్త్వం, శివుడి విజువల్స్ అద్భుతంగా చూపించిన ముస్లిం డైరెక్టర్..
అవికా గోర్ వియత్నాం పీఎం, మన పీఎంకు నమస్కారం చేస్తూ దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ కార్యక్రమానికి రావడం ఎంతో గౌరవంగా ఉంది. నరేంద్రమోదీ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి 52 మంది రాగా ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి నేను రావడం గర్వంగా ఉందని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమానికి అవికా గోర్ పద్దతిగా చీర కట్టుకొని సాంప్రదాయంగా వచ్చింది.
