Avika Gor-Milind Chandwani's wedding to take place on September 30
Avika Gor-Milind Chandwani: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో చాలా ఫేమస్ అయింది అవికాగోర్. ఆ ఫేమ్ తోనే సినిమాల్లోకి కూడా అడుగుపెట్టింది. ఆలా ఆమె తెలుగులో చేసిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఉమా పాత్రలో కనిపించిన ఆమె తెలుగు ఆడియన్స్ తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఆ తరువాత కూడా తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ, అవేవి కూడా ఆడియన్స్ ను అంతగా(Avika Gor-Milind Chandwani) ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఆ తరువాత బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది.
Venkatesh: కుర్ర హీరోలకు బుర్రపాడు.. స్టార్ డైరెక్టర్లు, భారీ సినిమాలు.. వెంకీమామ మాస్ లైనప్
ఇదిలా ఉంటే, అవికా గోర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. 2025 జూన్ లో అవికా గోర్ ఎంగేజ్మెంట్ మిలింద్ చంద్వానీతో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి డేట్ ను కన్ఫర్మ్ చేసింది అవికా. వీరిద్దరూ సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నారట. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో 2020 నుంచి డేటింగ్ లో ఉందట అవికా. 2019లో ఓ ప్రోగ్రామ్ లో భాగంగా మిలింద్ ను కలిసింది అవికా. ఆ పరిచయం కాస్త కొంతకాలానికి స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారిందట. అలా దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట పెద్దలకు తమ విషయాన్ని చెప్పగా వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారట. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఈ జంట.