Venkatesh: కుర్ర హీరోలకు బుర్రపాడు.. స్టార్ డైరెక్టర్లు, భారీ సినిమాలు.. వెంకీమామ మాస్ లైనప్
విక్టరీ వెంకటేష్(Venkatesh) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోగా నటించాడు. 2025 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది.

victory venkatesh is setting up crazy movies in a row
Venkatesh: విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోగా నటించాడు. 2025 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. రీజనల్ మూవీస్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ మూవీ. లాంగ్ రన్ లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా వెంకీమామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు (Venkatesh)అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.
అయితే, సంక్రాంతికి వస్తున్నాం అందించిన బ్లాక్ బస్టర్ తో ఆ తరువాత కూడా అదే రేంజ్ లో తన సినిమాలు ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడట వెంకీమామ. ఆ విషయంలో కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లో తన వాయిస్ తో మ్యాజిక్ చేశాడు వెంకటేష్.
ఈ సినిమా తరువాత వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించాడు త్రివిక్రమ్. అందుకే వీరి కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్ ఫంఛైజీ దృశ్యం 3ని మొదలుపెట్టనున్నాడు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలుకానుంది. ఇవే కాకుండా, నందమూరి బాలకృష్ణ సినిమాలో కూడా గెస్ట్ గా చేయనున్న వెంకటేష్.. మరో ఇద్దరు కుర్ర దర్శకులకు కూడా అవకాశం ఇచ్చాడట. మరి ఈ ఏజ్ లో కూడా వరుసగా క్రేజీ సినిమాలను సెట్ చేస్తున్న వెంకటేష్ ను చూసి యూజ్ హీరోలు సైతం షాక్ అవుతున్నారట.