Sujeeth: బైక్ నెట్టుకుంటూ వర్షంలో రాసిన కథ.. అవకాశం అంత ఈజీగా రాలేదు.. సుజీత్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్

సుజీత్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు మారుప్రోగిపోతోంది. ఈ(Sujeeth) కుర్ర దర్శకుడు తాజాగా తెరకెక్కించిన సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sujeeth: బైక్ నెట్టుకుంటూ వర్షంలో రాసిన కథ.. అవకాశం అంత ఈజీగా రాలేదు.. సుజీత్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్

Sujeeth makes interesting comments about his journey as a director

Updated On : September 22, 2025 / 4:25 PM IST

Sujeeth: సుజీత్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు మారుప్రోగిపోతోంది. ఈ కుర్ర దర్శకుడు తాజాగా(Sujeeth) తెరకెక్కించిన సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించడమే. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుజీత్ కే చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన అభిమాన హీరోను తెరపై ఎలా ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ కి నచ్చుతుందో పర్ఫెక్ట్ గా లెక్కేసి మరీ ఓజీ ని తెరకెక్కిస్తున్నాడు సుజీత్.

Kushi 2: ఖుషీ సినిమాకు సీక్వెల్.. నేను రెడీ.. డైరెక్టర్ ఎస్ జే సూర్య ఆసక్తికర కామెంట్స్

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజీత్ తన జర్నీ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తన జీవితంలో ఏది అంత ఈజీగా రాలేదని చెప్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దర్శకుడిగా అవకాశం కోసం ముందు ఒక ప్రేమకథను రాసుకున్న. తన జర్నీలో ఫస్ట్ మూవీ అది అయితేనే బాగుటుంది అని అనుకున్నాను. అదే కథను నిర్మాతలకు వినిపించా. వారికి ఫస్ట్‌ హాఫ్‌ బాగా నచ్చింది. సెకండాఫ్‌ కాస్త మార్చమని చెప్పారు. దానికోసం దాదాపు 5 నెలలు రాత్రింబవళ్లూ ఆలోచించి కొత్త వెర్షన్‌ రాశా. వెళ్లి వాళ్ళకి సెకండాఫ్‌ వినిపించా. వాళ్లకు కూడా నచ్చింది.

అబ్బా.. ప్రాజెక్టు ఓకే అయ్యింది అనుకుని ఆనందంతో బండిపై బయలుదేరా. ఇంటికి వెళ్తున్న మధ్యలోనే నిర్మాతలు ఫోన్‌ చేసి.. చూడమ్మా ఈ కథకు బడ్జెట్‌ ఎక్కువయ్యేలాగా ఉంది. వేరే కథ ఏదైనా ఉంటే చెప్పు.. అన్నారు. ఒక్కసారిగా మైండ్‌ బ్లాంక్ అయ్యింది. జోరు వర్షం. రోడ్డు పక్కన కూర్చొని చాలాసేపు ఏడ్చాను. కమెడియన్ వెన్నెల కిషోర్‌కు కాల్ చేశా. ఆయన కాస్త ధైర్యం చెప్పాడు. నువ్వు ఒక షార్ట్‌ ఫిల్మ్‌ ను గంటలో రాసేయగలవు. అలాంటిది సినిమా కథను ఒక రోజులో రాయలేవా అన్నాడు. దాంతో, లేచి బండి స్టార్ట్‌ చేస్తే కాలేదు. పెట్రోల్‌ అయిపోయింది. చేతిలో ఒక్కపైసా లేదు. అదే వానలో జూబ్లీహిల్స్‌ నుంచి ముషీరాబాద్‌ వరకూ బండిని నెట్టుకుంటూ వచ్చాను. ఆ ప్రయాణంలో బాధ, కోపం, కసి అన్నీ రకాల ఫీలింగ్స్‌ వచ్చాయి. అదే కసితో ‘రన్‌ రాజా రన్‌’ కథను సిద్ధం చేశాను. అదే కథను నిర్మాతలకు వినిపించా. ఒక్క డైలాగ్‌ కూడా మార్చకుండా ఓకే చేశారు. ఒక ఓటమి వచ్చిందని బాధపడకూడదు. మరో ప్రయత్నం మనకు విజయాన్ని అందిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు సుజీత్. దాంతో సినిమాపై సుజీత్ కి ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.